- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Diabetes: డయాబెటిస్ రోగులు చక్కెర ప్లేస్‌లో ఇవి తీసుకోండి.. తియ్యదనంతో పాటు బోలెడు లాభాలు
దిశ, వెబ్‌డెస్క్: ‘డయాబెటిస్ అనే వ్యాధి ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత’. తరచూ టాయిలెట్ వెళ్లాలనిపించడం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించడం, సడెన్‌గా అధిక బరువు పెరగడం, బద్ధకంగా ఉండటం వంటివి డయాబెటిస్ లక్షణాలు.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ పెషేంట్లు స్వీట్ ఎక్కువగా తినకూడదు అని వైద్యులు చెబుతుంటారు. తీపి పదార్థాలు అధికంగా తీసుకుంటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. అయితే డయాబెటిస్ రోగులకు కూడా స్వీట్ తినాలనిపిస్తుంది. కాగా చక్కెరతో తయారు చేసిన స్వీట్స్ కాకుండా దాని స్థానంలో బెల్లం, తేనె వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బెల్లం, తేనె వల్ల డయాబెటిస్ పెషెంట్లకు ఎలాంటి నష్టం జరగకపోగా.. పైగా బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..
తేనె ప్రయోజనాలు
డయాబెటిస్ రోగులు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే తేనె తీసుకుంటే ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతాయి. తేనెలో షుగర్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. కాగా తేనెను పరిమితిలో తీసుకుంటే డయాబెటిస్ పెషెంట్లకు మేలు జరుగుతుంది. అటు స్వీట్ తిన్నామనే భావన కలుగుతుంది.
బెల్లం ప్రయోజనాలు
బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంను క్రమబద్దీకరణ చేస్తుంది. బెల్లం వాటర్ తీసుకుంటే గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది. బెల్లాన్ని నేచురల్ స్వీట్‌గా చెప్పుకుంటారు. బెల్లంలో ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మిఠాయిల నుంచి పానీయాల వరకు ఎన్నో రకాల వంటకాల్లో షుగర్ కు బదులు బెల్లాన్ని వాడుతారు. బెల్లం డయాబెటిస్ పెషెంట్లకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More..