'హత్యకు హత్యే పరిహారం'.. పురాతన రోమ్‌లో దారుణమైన శిక్షలు

by Disha Web Desk 17 |
హత్యకు హత్యే పరిహారం.. పురాతన రోమ్‌లో దారుణమైన శిక్షలు
X

దిశ, ఫీచర్స్: నరకంలో శిక్షలు ఎలా ఉంటాయో 'అపరిచితుడు' సినిమాను చూస్తే అర్థమయింది. కానీ బతికి ఉండగానే అంతకు మించిన కఠిన శిక్షలను అమలు చేసింది పురాతన రోమ్. నేరాలకు అనుగుణంగా ఉరితీయడం, గొంతు కోయడం, 80 అడుగుల ఎత్తైన కొండ పైనుంచి విసిరేయడం ఇందులో కొన్ని కాగా, తిరుగుబాటుకు ప్రయత్నిస్తే శిలువ వేయడం మరో పద్ధతి. యుద్ధంలో ఓడిపోయిన వారిని రోమ్ వీధుల్లో శిలువ వేసిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయని చెప్తుంటారు విశ్లేషకులు.


ఈ క్రమంలోనే బంధువులను హత్య చేస్తే 'హత్యకు హత్యే పరిహారం' గా భావించే వారట. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన తండ్రిని చంపినందుకు భయంకరంగా శిక్షించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన శిక్షను 'పొయెనా కుల్లె' అని పిలవగా.. లాటిన్‌‌‌లో 'పెనాల్టీ ఆఫ్ ది సాక్'గా పిలిచారు. సుమారు 100BC లో ఇలాంటి కేసులు డాక్యుమెంట్ చేయబడినట్లు తెలుస్తుండగా.. ఇందులో భాగంగా పాములు, కుక్కలు, కోతులతో కలిపి మనిషిని ఓ గోనె సంచిలో కట్టి నీటిలోకి విసిరేవారు.


దీంతో ఇందులో బంధించబడిన జంతువులు ప్రాణభయంతో ఒకదానికొకటి శత్రువుగా మారి దాడి చేసుకోవడం, ఈ క్రమంలో మనిషిని చీల్చి చెండాడటం జరుగుతుంది. తద్వారా ఆ నేరస్థుడి చివరి క్షణాలు భయంకరమైనవిగా మార్చడమే ఈ శిక్ష అమలు వెనుకున్న ఉద్దేశ్యం కాగా.. ఈ పద్ధతి శతాబ్దాల పాటు కొనసాగినట్లు చరిత్ర చెప్తోంది. ఇక బైజాంటైన్స్ అని పిలువబడే తూర్పు రోమన్లు ఒక వ్యక్తిని చంపినందుకు గాను దోషిని సజీవ దహనం చేసేవారని, 1734 వరకు కూడా కొనసాగిన ఈ శిక్షలు.. 1761లో అధికారికంగా నిషేధించబడినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed