హెయిర్ గ్లో ను పెంచే కరివేపాకు.. అదెలాగంటే..

by Disha Web Desk 17 |
హెయిర్ గ్లో ను పెంచే కరివేపాకు.. అదెలాగంటే..
X

దిశ, ఫీచర్స్: కరివేపాకు కూరలో రుచినే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులంటున్నారు. ఈ ఆకులో విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.

జుట్టు పెరుగుదలకు కరివేపాకు‌లో విటమిన్ సి, బి, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని మెత్తగా నూరి తలకు పట్టించడం వల్ల తలలో రక్త ప్రసరణ కణాల పునరుత్పత్తి మెరుగుపడుతుంది. కొత్తగా జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది. స్కాల్ప్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కరివేపాకు తో పాటు ఉసిరి, మెంతులు కూడా జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. అందుకోసం ఒక గిన్నెలో మెంతులు, కరివేపాకు, ఉసిరికాయ సమాన పరిమాణంలో తీసుకొని గ్రైండ్ చేయాలి. పేస్ట్ లా మారాక దాన్ని తలకు పట్టించి, 30 నుంచి 45 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. కరివేపాకులో విటమిన్ బి, ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు చివర్లు చిట్లి పోకుండా ఉంటాయి.

చుండ్రు నివారణకు

కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్ నుంచి చుండ్రు‌ను తొలగించడంలో సహాయపడతాయి. గుప్పెడు కరివేపాకులను తీసుకొని చిక్కటి పేస్ట్‌ లా చేసి గ్రైండ్ చేసి, దానిని పెరుగులో కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చుండ్రు సమస్య తగ్గిపోతుంది.


పొడి జుట్టుకు

జుట్టు మెరుపును కోల్పోకుండా కరివేపాకు బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు వయస్సును బట్టి జుట్టు తెల్లబడేది కానీ, ప్రస్తుతం కాలం మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా తెల్ల బడుతోంది. అయితే తెల్ల జుట్టు సమస్యకు కరివేపాకు తో చెక్ పెట్టవచ్చు. కరివేపాకును ఎండబెట్టి మిక్సీలో వేయడంతో వచ్చిన పొడిని తలకు వాడే నూనెలో కలిపి పెట్టుకోవాలి. దీనివల్ల జుట్టు తెలుపు నుంచి నలుపునకు మారుతుంది.

షైనింగ్ హెయిర్

జుట్టు దృఢత్వానికి అతి ముఖ్యమైన అమినో యాసిడ్‌లు కరివేపాకు‌లో పుష్కలంగా ఉంటాయి. జుట్టులో నాచురల్ గ్లో తెచ్చేందుకు ఇవి సహాయపడతాయి. అంతేకాదు కొబ్బరి, కరివేపాకు టానిక్‌‌లను అప్లై చేయవచ్చు. ఒక బౌల్‌లో కొబ్బరి నూనె, కొన్ని కరివేపాకులు వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించి స్లో గా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు షైనీ గా మారుతుంది.


జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది

కరివేపాకులు, ఉల్లిపాయ రసం మిక్స్ చేసి జట్టుకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అందుకోసం ముందుగా 10 నుంచి 15 తాజా కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ లా చేయాలి. తర్వాత ఉల్లిపాయలు దంచుకొని వాటి రసాన్ని తీసి కరివేపాకు పేస్టుతో కలిపి తలకు అప్లై చేయాలి. గంట తర్వాత షాంపూతో కడగాలి. దీనివల్ల క్రమంగా జుట్టు రాలడం ఆగిపోతుంది.



Next Story

Most Viewed