హింసాత్మక ప్రవర్తనను తగ్గిస్తున్న హార్ట్ మెడిసిన్

by Disha Web Desk 10 |
హింసాత్మక ప్రవర్తనను తగ్గిస్తున్న హార్ట్ మెడిసిన్
X

దిశ, ఫీచర్స్ : హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు అసాధారణ గుండె లయలను(అబ్‌నార్మల్ హార్ట్ రిథమ్స్) నిర్వహించడంలో సహాయపడటానికి బీటా బ్లాకర్స్ ఉపయోగించబడుతున్నాయి. చాలా కాలంగా సంగీతకారులు, ప్రదర్శకులు స్టేజ్ భయాన్ని వీడేందుకు అనధికారికంగా వినియోగిస్తున్నారు. ప్రకంపనలను తగ్గించగల సామర్థ్యం కారణంగా పనితీరును మెరుగుపరిచేవిగా వర్గీకరించబడిన బీటా బ్లాకర్స్.. కొన్ని క్రీడల్లో కూడా నిషేధించబడ్డాయి.

నిజానికి బీటా బ్లాకర్స్ 1960లలో గుండె వ్యాధి అయిన ఆంజినాకు చికిత్సగా అభివృద్ధి చేయబడినప్పటికీ.. గ్లాకోమా నుంచి మైగ్రేన్ వరకు అనేక రకాల చికిత్సలకు ఉపయోగించబడ్డాయి. అయితే ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్స్ వంటి మనోవిక్షేప పరిస్థితుల కోసం బీటా బ్లాకర్లను ఉపయోగించడం బహుశా చాలా ఆసక్తికరమైనది. కాగా బీటా బ్లాకర్స్‌తో చికిత్స పొందిన రోగుల నుంచి 1.4 మిలియన్ల ఆరోగ్య రికార్డులను పరిశీలించిన పరిశోధకులు.. ఈ ఔషధం దూకుడు, హింసాత్మక ప్రవర్తనను కూడా తగ్గించవచ్చని కనుగొంది. ప్రతీ రోగిని దాదాపు ఎనిమిదేళ్ల వరకు అనుసరించిన అధ్యయనం.. సాధారణంగా అడ్రినలిన్, నోరాడ్రినలిన్ వంటి హార్మోన్ల కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం ద్వారా వివిధ రకాల ప్రవర్తనా సమస్యలకు చికిత్స చేయడంలో మందులు ఉపయోగపడతాయని గుర్తించారు. ఈ క్రమంలో మానసిక సమస్యలు, హింసాత్మక నేరాలు, ఆత్మహత్య ప్రవర్తన మధ్య అనుబంధాలపై దృష్టి సారించారు శాస్త్రవేత్తలు. ఆందోళన రేటును తగ్గించడంలో బీటా బ్లాకర్ ప్రభావవం లేదని, హింసాత్మక నేరాలకు 13% తక్కువ ప్రమాదానికి దారితీసే సంకేతాలున్నాయని తెలిపారు.

Next Story

Most Viewed