బిలియనీర్ల కామన్ హాబిట్స్.. సక్సెస్‌‌కు అవే కారణమా?

by Javid Pasha |
బిలియనీర్ల కామన్ హాబిట్స్.. సక్సెస్‌‌కు అవే కారణమా?
X

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తి బిలియనీర్ అవ్వాలంటే మరో బిలియనీర్‌ను అనుసరించాలా? ఏదైనా ఒక రంగంలో సక్సెస్ అవ్వాలంటే.. మరో సక్సెస్ ఫుల్ వ్యక్తి అడుగు జాడల్లో కచ్చితంగా నడవాలా? అనే సందేహాలు పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. ఎందుకంటే ఈ ప్రపచంలో అలాంటి వ్యక్తులకు లభించే గౌరవం ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి వారి ప్రవర్తన, జీవనశైలి, డైలీ రోటీన్స్ అన్నీ చర్చనీయాంశంగా మారుతాయి. అయితే ఏ వ్యక్తినీ సేమ్ టు సేమ్ అనుసరించాలని ఎవరూ చెప్పరు. కానీ వారిని ఆదర్శంగా తీసుకొని లేదా వారి ద్వారా స్ఫూర్తి పొంది తమ సొంత పద్ధతిలో ప్రయత్నించాలనేదే దీనివెనుక గల అసలు ఉద్దేశమని నిపుణులు చెప్తుంటారు. అందుకే గొప్ప వ్యక్తుల అలవాట్ల గురించి తెలుసుకుంటే మనం కూడా ఎలా ఎదగాలో ఒక అవగాహనకు రావచ్చునని పేర్కొంటున్నారు. అయితే కొందరు సక్సెస్ ఫుల్ వ్యక్తులు, బిలియనీర్లకు రోజువారీ అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొద్దున్న నిద్రలేవడం

చాలా మంది చెప్తున్న మంచి అలవాట్లు, సక్సెస్ వైపు నడిపించే హాబిట్స్‌లో సూర్యోదయానికి ముందు నిద్రలేవడం కూడా ఒకటి. మనం ఏ సక్సెస్‌ఫుల్ పీపుల్‌ను గమనించినా వారి దినచర్యలో భాగంగా ఈ అలవాటు తప్పక ఉంటుంది. అంతెందుకు ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్ జెఫ్‌ బెజోస్ ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తారు. అలాగే ప్రముఖ చైనీస్ బిజినెస్ మ్యాగ్నెట్ జాక్ మా, హెడ్జ్ ఫండ్ మేనేజర్ రే డాలియో వంటి ప్రముఖులు కూడా 5 నుంచి 6 గంటలలోపే నిద్రలేస్తారట. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్ గేట్స్, అలాగే స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. ఈ అలవాటు వారిని ఆనందంగా ఉంచుతుందని, సక్సెస్‌కు అదే కారణమని చెప్తుంటారు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

డైలీ ఎక్సర్‌సైజ్

బిలియనీర్లకు ఉండే మరో కామన్ హాబిట్ ఉదయంపూట వ్యాయామం చేయడం. కొందరు గ్రౌండ్‌లో పరుగెత్తితే, మరికొందరు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఇంకొందరు థ్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేస్తుంటారు. బిల్ గేట్స్ కూబి డైలీ మార్నింగ్ లేవగానే థ్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేస్తారుట, ట్వట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సే, మరో విలియనీర్ రే డాలియో వంటివారు డైలీ మెడిటేషన్ చేస్తారు. మనమూ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ప్రతిరోజూ చేయాలంటున్నారు నిపుణులు.

బుక్స్ చదవడం

నిజానికి పుస్తకాలు చదివే అలవాటు చాలా గొప్పదని నిపుణులు చెప్తుంటారు. బిలియనీర్లు, వివిధ రంగాల్లోని సక్సెస్ ఫుల్ పీపుల్ అందరికీ ఉండే సాధారణ అలవాట్లలో ఇది తప్పక ఉంటుంది. కాగా సాఫ్ట్ కాపీలు చదవడం కంటే కూడా ప్రింటెడ్ పుస్తకాలను చదవడం వల్ల బాగా గుర్తుండి పోతుందని కొందరు అంటారు. ఏది ఏమైనా పుస్తకాలు చదవడం మెదడును యాక్టివేట్ చేయడమే కాకుండా, విషయ పరిజ్ఞానానికి, సామాజిక అవగాహనకు సహాయపడతాయి. సక్సెస్ కు కారణం అవుతాయి. బిల్ గేట్స్ ఏడాదికి సుమారు 50 కొత్త పుస్తకాలు చదువుతారు.

క్వాలిటీ స్లీప్ అండ్ టైమ్

ఏ సమయంలో నిద్రపోయినప్పటికీ అది క్వాలిటీ స్లీప్ కాకపోతే మన మైండ్ సరిగ్గా పనిచేయదు. సక్సెస్‌ఫుల్ పీపుల్‌లో ఉండే సాధారణ అలవాట్లలో నాణ్యమైన నిద్ర కూడా ఒకటి. వారు ఎంత బిజీగా ఉన్నా నిద్రకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వారి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయని, మానసిక దృఢత్వం కలిగి ఉంటారని చెప్తుంటారు. దీంతోపాటు ఫ్యామిలీతో, ఆత్మీయులతో స్పెండ్ చేయడం, ఎమోషనల్ సపోర్ట్ అందించడం, పొందడం వంటివి కూడా బిలియనీర్ల అలవాట్లలో కనిపించే ప్రధాన లక్షణం. వారి సక్సెస్ వెనుక ఇలాంటి అవాట్లు, క్రమశిక్షణలే కారణం కాబట్టి, అనుసరించడం మనకూ మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story