మానవ అక్రమ రవాణాకు కారణమవుతున్న వాతావరణ విపత్తులు.. ఎలాగంటే ?

by Disha Web Desk 10 |
మానవ అక్రమ రవాణాకు కారణమవుతున్న వాతావరణ విపత్తులు.. ఎలాగంటే ?
X

దిశ, ఫీచర్స్: వాతావరణ సంబంధిత విపత్తులు మానవ అక్రమ రవాణాకు కారణమవుతున్నాయని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) పేర్కొంది. క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్ కారణంగా జీవనోపాధి కోసం మనుషులు మరోచోటుకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందని, ఈ సిచ్యుయేషన్‌ను హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయని నివేదించింది. ఈ క్రమంలోనే అపహరణకు గురవుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ మానవ అక్రమ రవాణా పెరిగేందుకు మరో ప్రమాద కారకంగా ఉందని వివరించింది.

800 కోర్టు కేసుల విశ్లేషణ, 2017 నుంచి 2020 మధ్య 141 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఈ నివేదికకు ఆధారం. వ్యవసాయం, చేపలు పట్టడం లాంటి జీవనోపాధి కలిగి, ఇందుకోసం సహజ వనరులపై ఆధారపడిన సమూహాలు వాతావరణ మార్పుల వల్ల దారుణంగా ప్రభావితమయ్యాయి. జీవనాధారం కోల్పోయి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రజలు అక్రమ రవాణాదారులకు సులభంగా టార్గెట్ అవుతున్నారని నివేదించింది తాజా అధ్యయనం.

2021లోనే 23.7 మిలియన్ల మంది ప్రజలు వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు. తమ దేశాలను పూర్తిగా విడిచిపెట్టారు. UN డ్రగ్ ఏజెన్సీ ప్రకారం.. ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్‌లో తీవ్రమైన తుఫానులు, టైఫూన్‌ల కారణంగా మిలియన్ల మంది ప్రజలను వారి ఇళ్ల నుంచి బలవంతంగా తరలించిన తర్వాత మానవ అక్రమ రవాణా కేసులు పెరిగాయి. ఇక తుఫానులు, సముద్ర మట్టం పెరుగుదలకు గురయ్యే అవకాశం ఉన్న కరీబియన్ ప్రాంతం, ఘనాలో కరువు, వరదల కారణంగా స్థానికులు బలవంతంగా మరోచోటుకు మారవలసి వచ్చింది. ఈ క్రమంలో అపహరణకు గురైన సంఘటనలు ఉన్నాయి.



Next Story