పశువుల ఉద్గారాలపై పన్ను విధింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న దేశం!

by Disha Web Desk 2 |
పశువుల ఉద్గారాలపై పన్ను విధింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న దేశం!
X

దిశ, ఫీచర్స్ : 'బర్పింగ్' (ఉద్గారాలు)చాలా అసౌకర్యమైన చర్యే అయినా, అది జరిమానా విధించదగినదిగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ న్యూజిలాండ్‌ మాత్రం పశువులపై బర్పింగ్ పన్ను విధించేందుకు సిద్ధమైంది. ఇది వింతగా అనిపించినప్పటికీ, వాతావరణ మార్పులను నియంత్రించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలోని మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో దాదాపు సగం పాడిపశువులు, వ్యవసాయం నుంచే వస్తుండటంతో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

న్యూజిలాండ్‌ ఓ చిన్న దేశం కాగా అక్కడి జనాభా కేవలం ఐదు మిలియన్లకు పైగా ఉంటుంది. కానీ దాదాపు 10 మిలియన్ల పశువులు(ఆవులు, గేదెలు), 26 మిలియన్ల గొర్రెలున్నట్లు సమాచారం. అంటే మనషుల సంఖ్యకు రెట్టింపుస్థాయిలో పశువులున్నాయి. నిజానికి వాటి పాపులేషన్ సమస్య కాదు కానీ ఆ దేశంలోని మొత్తం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో (ప్రధానంగా మీథేన్) సగం పాడిపశువుల నుంచే వస్తుంది. దీంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు పశువుల బర్పింగ్‌పై పన్ను విధించే నిర్ణయాన్ని ప్రకటించింది. సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్(స్థిరమైన పర్యావరణం) వైపు రైతులను పుష్ చేయడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తోంది.

న్యూజిలాండ్ మొత్తం మీథేన్ ఉద్గారాల్లో 85 శాతం కంటే ఎక్కువ జంతువుల బర్పింగ్, ఎరువు నుంచి వస్తుండగా, దాదాపు 5 శాతం అపానవాయువు ద్వారా విడుదలవుతుందని స్కై న్యూస్ వివరించింది. ఈ మేరకు ఉద్గారాల్లో కొంతమేరనైనా నిరోధించేందుకు 2025 నుంచి రైతులు తమ జంతువుల ఉద్గారాలకు జరిమానాలు చెల్లించాల్సిన డ్రాఫ్ట్ ప్లాన్‌ను ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. నేషనల్ పబ్లిక్ రేడియో ప్రకారం, రైతులకు పన్ను విధించే చర్యలు గతంలో బలమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నప్పటికీ, పశువుల ఉద్గారాలను పరిష్కరించడం వాతావరణ మార్పును మందగించడంలో గేమ్ ఛేంజర్ కావచ్చు. అందువల్ల ప్రభుత్వం ఈసారి తప్పనిసరిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ విధంగా సేకరించిన డబ్బును అగ్రికల్చర్ రీసెర్చ్, రైతులకు సంబంధించిన రీసెర్చ్ డెవలప్‌మెంట్స్, సలహా సేవల్లో పెట్టుబడి పెట్టనున్నట్లు దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రహాన్ని వేడి చేసే విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మీథేన్‌ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. 100ఏళ్లలో కార్బన్‌డైఆక్సైడ్ కంటే 28-34 రెట్లు ఎక్కువగా విడుదలవుతోంది.



Next Story

Most Viewed