ఆర్టిఫిషియల్ లివర్‌ను డెవలప్ చేసిన చైనీస్ సైంటిస్టులు.. త్వరలో అందుబాటులోకి

by Hamsa |
ఆర్టిఫిషియల్ లివర్‌ను డెవలప్ చేసిన చైనీస్ సైంటిస్టులు.. త్వరలో అందుబాటులోకి
X

దిశ, ఫీచర్స్: ప్రతీ సంవత్సరం వరల్డ్‌వైడ్‌‌గా 5 లక్షల నుంచి ఒక మిలియన్ వరకు లివర్ డ్యామేజెస్ లేదా లివర్ ఫెయిల్యూర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనీస్ సైంటిస్టులు ఒక గుడ్ న్యూస్ అందించారు. ఏంటంటే.. స్టెమ్ సెల్ ఆధారిత ఆర్టిఫిషియల్ లివర్‌ను వారు తయారు. కాలేయం డ్యామేజ్ అయిన వారిలో దాని పునరుద్ధరణ వరకు ఈ బయో ఆర్టిఫిషియల్ లివర్ హ్యూమన్ బాడీ వెలుపల డిటాక్సినేషన్ అండ్ ప్రోటీన్ల సంశ్లేషణ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుందట. ప్రజెంట్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తు్న్నారు. కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న అనేక మంది రోగులకు ఈ కొత్త పరిణామం ఆశానకంగా ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

చైనీస్ సైంటిస్టులు క్రియేట్ చేసిన బయో ఆర్టిఫిషియల్ లివర్ వాస్తవానికి బయో రియాక్టర్ వ్యవస్థ మాదిరి పనిచేస్తుంది. ఇందులో ఒక బోలు ఫైబర్ లేయర్‌తో కూడిన మూలకణాలు ఉంటాయి. డ్యామేజ్ అయిన లివర్ పునరుద్ధరణకు కణజాలాన్ని పునరుత్పత్తి చేయడంలో సహాయపడతాయి. వాపు వల్ల కలిగే కాలేయ నష్టాన్ని అణిచివేసేందుకు అవసరమైన పదార్థాలను రోగి రక్తప్రవాహంలోకి దీని ద్వారా ప్రవేశపెట్టబడతాయని గ్వాంగ్‌ డాంగ్ ప్రావిన్స్‌లోని సదరన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన జుజియాంగ్ హాస్పిటల్‌లోని ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గావో యి పేర్కొన్నారు.

ఇలాంటి లేయర్స్ ఇతర వైద్య ప్రక్రియలలో ఉపయోగించబడినప్పటికీ, లివర్ మూలకణాలను కల్చర్ చేయడానికి యూజ్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ మెథడ్ యానిమల్ మోడల్స్‌‌లో, ముఖ్యంగా పందులు, కోతులలో బాగానే పనిచేసిందని, మనుగడ రేటును 17 శాతం పెంచిందని చైనీస్ పరిశోధకులు చెప్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ కూడా దాదాపు సక్సెస్ అయ్యే అవకాశం ఉందని, త్వరలో లివర్ డ్యామేజ్, ఫెయిల్యూర్ సంబంధిత చికిత్సలలో ఆర్టిఫిషియల్ లివర్స్ అద్భుతంగా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed