- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పిల్లల ముందే బట్టలు చేంజ్ చేసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులెవరైనా సరే తమ పిల్లలతో కలిసి తినడం, కలిసి పడుకోవడం, టైమ్ స్పెండ్ చేయడం కామన్. అయితే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల ముందే బట్టలు మార్చుకుంటారు. పిల్లలతో కలిసి స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలపై ఆ ప్రభావం పడుతుంది. వారి శరీరాలపై ఆసక్తి పెరుగుతుంది. పిల్లల బాడీకి, పెద్దల శరీరానికి మధ్య తేడా ఏంటి అనే ప్రశ్నలు వారిలో తలెత్తుతాయి. పిల్లల ముందు మీరు నగ్నంగా ఉన్నా ఆ విషయాన్ని వాళ్లు గమనిస్తారు. ఆ సమయంలో వారు మామూలుగా ప్రవర్తించినా ఆ తర్వాత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల ముందు నగ్నంగా ఉండటం తప్పు కాదు అనే భావన పిల్లలకు వచ్చే చాన్స్ ఉంది.
హాలులో జనాలు ఉన్నా చిన్న పిల్లలకు బట్టలు మార్చడం, శరీరానికి క్రీములు రుద్దడం కూడా చేస్తాం. అది కూడా వారి ప్రవర్తనలో మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయాల్లో అందరు తల్లిదండ్రులు ఒకేలా ఉండరు. కొంతమంది పిల్లలతో కలిసి స్నానం చేయరు. వారికి ముందే స్నానం చేయించి బాత్ రూం నుంచి బయటకు పంపిస్తారు. ఇలా ప్రతి ఇంట్లో పిల్లల పెంపకం భిన్నంగా ఉంటుంది. కానీ నేటి పిల్లలు చాలా మెచ్యూరిటీగా బీహేవ్ చేస్తున్నారు. బాడీ పార్ట్స్, వాటిల్లో వచ్చే మార్పు, సినిమాల్లో చూసే రొమాన్స్ పిల్లలకు కొత్తగా అనిపించవచ్చు.
వాటిపై పిల్లలు మనల్ని ప్రశ్నించవచ్చు. అలాంటి విషయాల్లో వారికి అర్ధమయ్యే భాషలో వివరించాలి. ఏది చెడు, ఏది మంచి అనేది క్లియర్‌గా వివరించాలి. అలాగే పిల్లలను ఇష్టం లేకపోయినా లాలించడం తప్పు. లిప్స్‌పై ముద్దులు పెట్టడం తప్పు. ముఖ్యంగా ఆడపిల్లలకు బాడీ పార్ట్స్‌పై అవగాహన కల్పించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. ఇలా పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.