పర్‌ఫ్యూమ్‌తో PCOS వచ్చే చాన్స్.. ప్రతి పది మందిలో ముగ్గురికి ఆ సమస్య కూడా..

by Javid Pasha |
పర్‌ఫ్యూమ్‌తో PCOS వచ్చే చాన్స్.. ప్రతి పది మందిలో ముగ్గురికి ఆ సమస్య కూడా..
X

దిశ, ఫీచర్స్ : నిజానికి సువాసనలు వెదజల్లే పర్‌ఫ్యూమ్స్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. స్త్రీ, పురుషులు తేడా లేకుండా అందరూ వాడుతుంటారు. అయితే దీని అతివాడకం మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌కు కారణం అవుతోందని, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)కు దారితీస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం ప్రతి పది మంది స్త్రీలల్లో ముగ్గురు పీసీఓఎస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

పర్‌ఫ్యూమ్స్‌ అధికంగా వాడే మహిళల్లో పీసీఓఎస్ ప్రభావం అధికంగా ఉండటానికి కారణం అందులోని విష పదార్థాలు, రసాయనాలు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కృత్రిమ సువాసనల్లో ‘ట్రైక్లోసన్’ అనే క్లోరినేటెడ్ ఫ్రాగ్రెన్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మహిళల్లో ఈస్ట్రోజెనిక్, ఆండ్రోజెనిక్, యాంటీ ఆండ్రోజెనిక్ యాక్టివిటీస్‌కు నష్టం చేకూరుస్తుంది. థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తుంది.

హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నందున ట్రైక్లోసన్‌ రసాయనాలు ఉండే కొన్ని ఉత్పత్తులను యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతంలో బ్యాన్ చేసింది కూడా. ముఖ్యంగా స్నానానికి ఉపయోగించే సబ్బుల్లో ట్రైక్లోసన్‌తో పాటు 18 ఇతర యాంటీ మైక్రోబయల్ కెమికల్స్ వాడటాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఇండియాలో అయితే దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. కాబట్టి పర్ఫ్యూమ్స్ వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి. వాటి తయారీలో హానికారక రసాయనాలు లేవని నిర్ధారించుకుంటేనే వాడటం మంచిది లేకపోతే మహిళలు పీసీఓఎస్, ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యల బారిన పడవచ్చు. పురుషుల్లోనూ హార్మోన్ల అసమతుల్యతవల్ల అనర్థాలు జరగవచ్చు.Next Story

Most Viewed