చీమల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చా.. సైంటిస్టుల అధ్యయనం చెప్తున్నదేమిటి ?

by Disha Web Desk 10 |
చీమల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చా..  సైంటిస్టుల అధ్యయనం చెప్తున్నదేమిటి ?
X

దిశ, ఫీచర్స్ : చీమల ద్వారా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చా? సైంటిస్టులు ఇటీవల నిర్వహించిన అధ్యయనం ఇది సాధ్యం అయ్యే అవకావం ఉందనే ఆశాభావాన్ని కలిగిస్తోంది. చీమలు షుగర్ వాటర్ కోసం వెతికే తీరును ఆధారంగా చేసుకుని ఇటీవల నిర్వహించిన ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. భవిష్యత్తులో చీమల ద్వారా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించే రోజులు రాబోతున్నాయనేందుకు ఈ పరిశోధన ఒక మొదటి అడుగు అని అభిప్రాయపడుతున్నారు.

చీమల గురించి మనందరికీ తెలిసిందే. వాటికి ముక్కు లేనప్పటికీ వాసనను పసిగట్టగలిగే ప్రత్యేక లక్షణం ఉంటుంది. అయితే అవి క్యాన్సర్ వాసనను పసిగట్టగలవని సైంటిస్టులు చెప్తున్నారు. వివిధ రకాలు కూడా అద్భుతమైన వాసనను పసిగట్టగలుగుతాయి. అయితే చీమలు, కీటకాల తలపై భాగం(యాంటెన్నా)పై అద్భుతమైన గ్రహణశక్తి కలిగి ఉంటుంది. వాసనలను ఇట్టే పసిగలిగేందుకు ఇది దోహదపడుతుంది. అందుకే అవి క్యాన్సర్ కణితుల నుంచి సేకరించిన లిక్విడ్ లేదా కణాల వాసనను గుర్తించగలుగుతాయి.

క్యాన్సర్ కణితులు, కర్భన సమ్మేళనాలు

క్యాన్సర్ కణితుల నుంచి విడుదలయ్యే ప్రత్యేకమైన అస్థిర కర్బన సమ్మేళనాలు, బ్లడ్ సెల్స్, చెమట, మూత్రం వంటి శరీర ద్రవాలలోను, బ్రీతింగ్ టైమ్‌లో రిలీజ్ అయ్యే తేమలాంటి ద్రవంలోను ఉంటాయి. అయితే వీటిలోని పదార్థాలను, వాసనను గుర్తించగలిగే గ్రహణ శక్తి చీమలకు ఉంటుందని ఇటీవల రాయల్ సొసైటీ B ప్రొసీడింగ్స్‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొంటున్నది. అధ్యయన కర్తలు అందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. క్యాన్సర్‌ను గుర్తించేందుకు చీమలను ఉపయోగించాల్సి వస్తే మేలు జరుగుతుంది. ఒక్కరోజుకు తక్కువ ఖర్చుతో, నాన్-ఇన్వాసివ్ క్యాన్సర్ డిటెక్షన్ పద్ధతిగా ఉపయోగించవచ్చు.

మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో క్యాన్సర్-గుర్తించే కీటకాలు లేదా మిడతలను ఉపయోగిస్తూ ప్రయోగాలు చేస్తున్న బయోమెడికల్ ఇంజినీర్ దేబజిత్ సాహా క్యాన్సర్‌ను గుర్తించడంలో చీమలను ఉపయోగించడం అనేది ఒక అద్భుతమైన మార్గం అన్నారు. కొత్త అధ్యయనంలో అతను పాల్గొనకపోయినప్పటికీ, వ్యాధులను గుర్తించడానికి కీటకాలను, చీమలను ఉపయోగించడంలో జీవశాస్త్రం అద్భుతంగా యూజ్ అవుతుందని పేర్కొన్నాడు.

'ఫార్మికా ఫుస్కా' చీమల ద్వారా

ప్రధాన అధ్యయన కర్త బాప్టిస్ట్ పిక్యూరెట్, సోర్బోన్ ప్యారిస్ నార్త్ యూనివర్శిటీకి చెందిన ఎథాలజిస్ట్, క్యాన్సర్ కణాల నుంచి వెలువడే (బ్లడ్ సెల్స్) అస్థిర కర్బన సమ్మేళనాలను చీమలు గుర్తించగలవని తెలిపాడు. అతను గతంలో ఫార్మికా ఫుస్కా జాతి చీమల ద్వారా క్యాన్సర్ కణాలను, సాధారణ పెరిగే కణాలను గుర్తించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. ప్రస్తుతం కణితుల ద్వారా పరిశోధనను అభివృద్ధి చేశాడు. అతని ఇంతకు ముందటి పరిశోధనలు iScienceలో పబ్లిష్ అయ్యాయి కూడా.

జెనోగ్రాఫ్టింగ్ అండ్ రివార్డ్స్

పిక్యూరెట్‌తోపాటు అతని టీమ్ మొదట రొమ్ము క్యాన్సర్ కణితులను ఎలుకలలోకి మార్పిడి చేయడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి జెనోగ్రాఫ్టింగ్ పద్ధతిని ఉపయోగించారు. అప్పుడు వారు కణితితో బాధపడుతున్న ఎలుకల నుండి యూరినల్ నమూనాలను కూడా సేకరించారు. తీసుకున్నారు. ఆ తర్వాత పరిశోధకులు క్యాన్సర్ బారిన పడిన జంతువుల యూరిన్ పక్కన షుగర్ వాటర్ డ్రాప్‌ను వేయడం ద్వారా చీమలు వాటి వాసనను పసిగట్టేలా చేశారు. ఆ తర్వాత అవి సాధారణంగా పసిగట్టే తీరును పరిశీలించేందుకు షుగర్ వాటర్‌ను తీసివేసి, కణితుల నుంచి సేకరించిన ద్రవం వద్ద చీమలను ఉంచినప్పుడు కూడా వాసన పసిగడుతూ తిరగసాగాయి. కీటకాలు క్యాన్సర్ ఎలుకల యూరిన్ చుట్టూ కూడా అవి ఎలుకలకంటే కంటే దాదాపు 20% ఎక్కువసేపు ఉండగలిగాయి. అయితే ఈ పరిశోధనకోసం పరిశోధకులు దాదాపు 10 నిమిషాల సమయంలో సెషన్ల వారీగా వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. క్యాన్సర్‌ను గుర్తించడానికి కుక్కలకు శిక్షణ ఇవ్వడం కంటే, చీమలకు ఇవ్వడం చాలా ఈజీ అని వారి పరిశోధనలో తేలింది.

భారం తప్పుతుంది

ప్రపంచవ్యాప్తంగా మానవులలో సంభవిస్తున్న ప్రతి ఆరు మరణాలలో ఒకటి క్యాన్సర్ వల్ల సంభవిస్తున్నది. అంటే క్యాన్సర్ ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉంది. సరైన సమయంలో లేదా ముందస్తుగా గుర్తించకపోవడం అనేది మరణానికి దారి తీస్తోంది. అయితే ప్రస్తుతం క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే స్క్రీనింగ్ టెస్టులు ఖరీదైనవిగా ఉంటున్నాయి. కణితుల చుట్టూ చీమలను ప్రవేశపెట్టి గుర్తించే పద్ధతి అమలులోకి వస్తే గనుక ముందస్తుగా గుర్తించే పని సులువవుతుందని పలువురు జీవశాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

చీమల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ సాధ్యమే !

చీమల ద్వారా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం అనేది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అది సాధ్యమయ్యే అవకాశాలు తప్పక ఉన్నాయనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. కణితుల చుట్టూ చీమలను వదిలి క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విధమైన నమ్మకాన్ని కలిగిస్తోందని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇది ప్రయోగ దశలోనే ఉంది. క్లినికల్ అప్లికేషన్‌కు ఇంకా చాలా దూరంగా ఉందని అధ్యయన బృందానికి నాయకత్వం వహిస్తున్న పిక్యూరెట్(Piqueret) నొక్కిచెప్పారు. క్యాన్సర్ ఉన్న వ్యక్తుల నుంచి యూరిన్ సేకరించడం ద్వారా పరిశోధకులు తమ అధ్యయనాన్ని విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్యాన్సర్‌ను గుర్తించక ముందు కణితి ఎంత చిన్నదిగా ఉంటుందో తెలుసుకోవడానికి అమెరికన్ సైంటిస్టులు నివేదిక బహిర్గతం చేస్తున్నది. అంటే భవిష్యత్తులో క్యాన్సర్ కణితుల నుంచి సేకరించిన బ్లడ్ సెల్స్ లేదా క్యాన్సర్ రోగుల సేకరించిన యూరిన్‌ను ల్యాబ్‌లో ఉంచి చీమలను ప్రవేశ పెట్టి క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించే రోజులు రాబోతున్నాయనేది సైంటిస్టుల పరిశోధన సారాంశం. ఇదే గనుక సాధ్యమైతే క్యాన్సర్ వైద్య చరిత్రలో మరో అడుగు ముందుకు పడినట్టే.

Next Story

Most Viewed