పీరియడ్స్‌ సమయంలో సెక్స్ మంచిదేనా..? వైద్యులు చెబుతుంది ఇదే..!

by sudharani |
పీరియడ్స్‌ సమయంలో సెక్స్ మంచిదేనా..? వైద్యులు చెబుతుంది ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం అంటే ఇష్టపడని వారుండరు. ఇంట్లో ఏకాంతంగా ఉన్నారంటే నిమిషం ఆలస్యం చేయకుండా బెడ్ రూంలో దూరిపోతుంటారు. పెళ్లైన కొత్తలో ఈ ఉత్సాహం మరి ఎక్కువగా ఉంటుంది. భార్యభర్తలు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనిస్థితిలో ఉంటారు. నిత్యం శృంగారంలో పాల్గొనాలని తాపత్రయపడుతుంటారు. ఇలాంటి కొత్త జంటలకు పీరియడ్స్ టైం విరహ వేధనను పెంచుతాయి. అయితే కొంతమందికి పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా.. వద్దా అనే సందేహాలు ఉంటాయి. ఇలాంటి అనుమానాలకు వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు. అవేంటో చూద్దాం.

పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే స్త్రీలకు అధిక లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఆ ఐదు రోజుల సమయంలో మహిళల్లో అలసట, కడుపు నొప్పి, నీరసం వస్తుంది. అయినా ఎలాంటి ఇబ్బంది లేని జంటలు పీరియడ్ సమయంలోనూ శృంగారంలో పాల్గొనవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమయంలో సెక్స్ చేస్తే మహిళల్లో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలై ఒత్తిడిని తగ్గడంతోపాటు మానసిక స్థితిని మెరుగుపడుతుంది. దాని వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ ఆనందం పొందుతారట. రుతుక్రమం కాలపరిమితి తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే మైగ్రేన్, తలనొప్పి, తిమ్మిరి, వెన్నునొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యల నుంచి మహిళలు ఉపశమనం పొందుతారు. పీరియడ్ సమయంలో సెక్స్ వల్ల గర్భందాల్చే అవకాశం కూడా ఉండదని చెబుతున్నారు.

పీరియడ్ సమయంలో సెక్స్‌తో నష్టాలూ ఉన్నాయ్..

పీరియడ్స్ సమయంలో శృంగారం చేస్తే యోని పీహెచ్ స్థాయి పెరిగి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. మహిళల్లో హెచ్‌ఐవి, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే సెక్స్ ద్వారా సంక్రమించే వైరస్లు రక్తంలో కూడా ఉంటాయి. అందుకే పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధం పెట్టుకునేటప్పుడు కండోమ్ (ప్రొటెక్షన్) ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి:

మీ భర్త పరాయి స్త్రీ వైపు చూడకూడదా.. అయితే ఇలా చేయండి



Next Story

Most Viewed