గర్భిణులు కీర దోసకాయలు తినొచ్చా?

by Disha Web Desk 1 |
గర్భిణులు కీర దోసకాయలు తినొచ్చా?
X

దిశ, వెబ్ డెస్క్: ఎండాకాలంలో చాలా మంది శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తింటుంటారు. ఎండాకాలంలో ఎక్కువ మంది తినే కూరగాయ కీరదోసకాయ. ఈ సీజన్ లో కీరదోసకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశమే ఉండదు. దోసకాయలు గర్భిణీ స్త్రీలకు ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దోసకాయల్లో విటమిన్ సి, విటమిన్ కె, బి విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఇనుము, జింక్ వంటి ఖనిజాలతో పాటుగా సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. గర్భంలో పెరుగుతున్న పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ పోషకాలు చాలా అవసరం. దోసకాయలలో ఉండే విటమిన్ బీ6, విటమిన్ బీ9 వంటి బీ విటమిన్లను 'ఫీల్ గుడ్' విటమిన్లు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి ఆందోళనను, ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. తరచుగా మూడ్ స్వింగ్స్ లేదా ఆందోళనకు గురయ్యే గర్భిణులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

దోసకాయలలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. హార్మోన్ల మార్పుల వల్ల రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కాబట్టి గర్భిణులు దోసకాయను తింటే ఈ సమస్య ఉండదు. దోసకాయలు మన శరీరంలో సోడియం స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతాయి. దోసకాయ గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో రక్తపోటు మెరుగ్గా ఉన్నప్పుడే తల్లీ బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. పిండి అభివృద్ధి కూడా బాగుంటుంది.

దోసకాయ వల్ల ఎన్నిఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దోసకాయలను లిమిట్ లోనే తినాలి. ఎందుకంటే వీటిలో ఉప్పు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తరచుగా మూత్రం రావడం, అలెర్జీ, అజీర్ణం, బెల్చింగ్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని మితంగా తింటే దీని ప్రయోజనాలను పొందాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Next Story