ప్లేగు వ్యాప్తికి ఎలుకలు కారణం కాదు.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు

by Disha Web Desk 17 |
ప్లేగు వ్యాప్తికి ఎలుకలు కారణం కాదు.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక మహమ్మారిగా చరిత్రకారులచే పరిగణించబడుతున్న ప్లేగు వ్యాధి 1347-53 మధ్య ఐరోపా ను ధ్వంసం చేసింది. దాదాపు 75 నుంచి 200 మిలియన్ల మందిని పొట్టన పెట్టుకుంది. 'యెర్సినియా పెస్టిస్' బ్యాక్టీరియా వలన కలిగిన ఈ పాండమిక్ 19వ శతాబ్దం వరకు కొనసాగగా.. యురేషియా, ఉత్తరాఫ్రికాలోనూ విజృంభించింది. సిసిలీలోని ఓడరేవు నగరమైన మెస్సినాలో క్రిమియా, ఆసియా నుంచి వచ్చిన ఓడ నావికుడి ద్వారా 14వ శతాబ్దంలో ఈ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైందని చారిత్రక రికార్డులు చెబుతుండగా.. ఎలుకలు ఈ వ్యాధి వ్యాప్తిని వేగవంతం చేశాయని చాలా కాలంగా భావిస్తున్నారు.

అయితే యూరప్‌లో ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేయడంలో ఎలుకలు కీలక పాత్ర పోషించకపోవచ్చని ఇటీవలి పరిశోధన సూచించింది. ఎలుకల్లో బ్యాక్టీరియం ఉనికిని యానిమల్ రిజర్వాయర్ అని పిలుస్తారు. కానీ ఐరోపాలోని పర్యావరణ పరిస్థితులు ప్లేగు వ్యాప్తిని, దీర్ఘకాలిక యానిమల్ రిజర్వాయర్‌లను నిరోధించగలవు అనే వాస్తవం నుండి ఇది వచ్చింది. అలాంటప్పుడు వ్యాధి వ్యాప్తి ఎలా జరిగిందనే విషయంలో చరిత్రకారులు, శాస్త్రవేత్తలు అయోమయంలో పడ్డారు. అయితే బ్లాక్ డెత్ వ్యాప్తికి రెండు అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు సైంటిస్టులు. ప్లేగు ఆసియా ప్లేగు రిజర్వాయర్ల నుంచి తిరిగి ప్రవేశపెట్టబడటం లేదా ఐరోపాలో స్వల్ప లేదా మధ్యకాలిక ప్లేగు రిజర్వాయర్‌ల ఉనికి ఉండవచ్చు.

యూరోపియన్ బ్లాక్ డెత్

బ్లాక్ డెత్ మహమ్మారి భయంకరమైనది. ఆఫ్రో-యురేషియా అంతటా వినాశనం కలిగించిన పాండమిక్.. ఆ సమయంలో ప్రపంచ మానవ జనాభాలో దాదాపు సగం మందిని చంపింది. ప్లేగు వ్యాధి మరణాలలోని లక్షణాల్లో ఎక్కువ భాగం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాపు శోషరస కణుతులు ఉండేవి. అయితే ఈ మహమ్మారికి ఎలుకలు కారణమని చాలా కాలంగా చిత్రీకరించబడినప్పటికీ, నెమ్మదిగా కదిలే చిన్న క్షీరదాలే (ఈగలు లేదా పేను) ఇందుకు కారణమయ్యాయని అధ్యయనం సూచించింది. ఇక Y. పెస్టిస్ బ్యాక్టీరియా మానవుని నుంచి మానవునికి మరింత సమర్థవంతంగా వ్యాపించే అవకాశం ఉందన్న వారు.. మానవుల శ్వాసకోశ వ్యవస్థలు, హత్తుకునే కార్యకలాపాల ద్వారా ఇటువంటి ప్రసారం జరిగి ఉంటుందని ఊహించారు.

Next Story

Most Viewed