పీరియడ్ బ్లడ్ మరకల ఫొటోలను షేర్ చేసిన అథ్లెట్.. వావ్ అంటూ నెటిజన్స్ రియాక్షన్

by Disha Web Desk |
పీరియడ్ బ్లడ్ మరకల ఫొటోలను షేర్ చేసిన అథ్లెట్.. వావ్ అంటూ నెటిజన్స్ రియాక్షన్
X

దిశ, ఫీచర్స్: పీరియడ్ స్టెయిన్స్‌ను కొందరు అసహ్యించుకోవచ్చు. కానీ స్త్రీలలో మరో వర్గం దీనిని సహజ ప్రక్రియగా స్వీకరించింది. ఈ కోవకు చెందిన అథ్లెట్ ఎమ్మా పల్లంట్-బ్రౌన్ .. సమాజంలో మార్పు తీసుకురావడానికి, సాంప్రదాయిక ఆలోచనా విధానాన్ని వదిలించుకోవడానికి వినూత్న ప్రయత్నం చేసింది. రుతుక్రమం గురించి సొసైటీలో చేంజ్‌కు సహకారం అందించింది. పీరియడ్స్ కారణంగా సక్సెస్‌ను అందుకునే సమయంలో మహిళలు ఇకపై వెనక్కితగ్గరని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా రుజువు చేసింది.

మే 19న స్పెయిన్‌లోని ఇబిజాలో జరిగిన ప్రొఫెషనల్ ట్రయాథ్‌లెట్స్ ఆర్గనైజేషన్ (PTO) యూరోపియన్ ఓపెన్ ట్రయాథ్లాన్‌లో పాల్గొన్న ప్రొఫెషనల్ అథ్లెట్ ఎమ్మా‌కు.. ఆ ఈవెంట్ జరిగిన రోజే ఆమె పీరియడ్ డే కావడంతో అనుకూలంగా అనిపించలేదు. కానీ ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని మారథాన్‌లో పాల్గొనకపోవడం సబబు కాదని అనుకుంది. పీరియడ్స్‌లోనే మారథాన్‌ను కొనసాగించింది. ఈ క్రమంలో ఆమె దుస్తులపై పీరియడ్- బ్లడ్ స్టెయిన్స్ కలగడంతో..రక్తపు మరకలతోనే పరుగెత్తి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఇతర మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నాయి. కాగా 99శాతం మంది స్త్రీలు ఇలాంటి బాధలుపడతారని.. ఇలాంటివి షేర్ చేయడంలో తప్పు లేదని చెప్పుకొచ్చింది ఎమ్మా. అందుకే ఇలాంటి ఫొటోలను గ్యాలరీలో సేవ్ చేయాలని, ఆరాధించాలని సూచించింది. కష్టతరమైన రోజుల్లో ఎలా పనిచేశారో గుర్తుకుతేవడంలో ప్రధానపాత్ర పోషించే ఫొటోలు.. ఇతరులకు ఇన్‌స్పిరేషన్‌ను అందిస్తాయని అభిప్రాయపడింది. ఇక ఈ పోస్ట్‌పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. ఎమ్మా స్ట్రాంగ్ రోల్ మోడల్ అంటూ ప్రశంసిస్తున్నారు. స్త్రీ ఒక అద్భుతం అని కొనియాడుతున్నారు.

Also Read..

పీరియడ్స్‌ సమయంలో సెక్స్ మంచిదేనా..? వైద్యులు చెబుతుంది ఇదే..!


Next Story