బ్రహ్మ ముహూర్తం.. సూర్యోదయానికి ఎన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది..?

by Disha Web Desk 7 |
బ్రహ్మ ముహూర్తం.. సూర్యోదయానికి ఎన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది..?
X

దిశ, ఫీచర్స్: త్వరగా మేల్కొనడం మూలంగా మానసిక, శారీరక ప్రయోజనాలు కలుగుతాయనేది పురాణాల్లో పొందుపరచబడింది. దీని వల్ల ప్రొడక్టివిటీ, యాక్టివ్‌నెస్, అలర్ట్‌నెస్ పెరుగుతుందని, రోజు మొత్తాన్ని పూర్తిగా ఆస్వాదించడంతో పాటు అనేక పనులపై దృష్టిపెట్టే సమయం లభిస్తుందని తెలుపబడింది. అయితే కొంత మంది ఉదయం ఐదు గంటలకే నిద్ర లేస్తే.. మరికొంత మంది అంతకు ముందే తమ రోజును ప్రారంభిస్తారు. ఈ క్రమంలో మేల్కొనడానికి ఉత్తమ సమయం ఏంటి? అనే చర్చ జరుగుతుండగా.. ‘బ్రహ్మ ముహూర్తం’లో లేవడం ఉత్తమమని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ దీన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఎలాంటి లాభాలు చేకూరుతాయి? తెలుసుకుందాం.

బ్రహ్మ ముహూర్తాన్ని సులభమైన మార్గంలో లెక్కించవచ్చని అంటున్నారు నిపుణులు. రాత్రిని సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉన్న కాలంగా పరిగణించినప్పుడు.. 14 భాగాలుగా విభజిస్తారు. చివరి భాగం లేదా చివరి త్రైమాసికాన్ని ‘బ్రహ్మ ముహూర్తం’ అని అంటారు. సూర్యోదయానికి ఒక గంట 36 నిమిషాల ముందు ఈ టైమ్ ప్రారంభమయ్యే ఈ సమయం.. తెల్లవారుజామున 3:30 నుంచి ఆరు గంటల మధ్య ఎప్పుడైనా ఉండొచ్చు. రుతువులు, భౌగోళిక పరిస్థితులను బట్టి సూర్యోదయం మారుతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తం కూడా తదనుగుణంగా మారుతుంది.

ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. ఈ దోషాలు రోజులోని వివిధ సమయాల్లో చురుకుగా ఉంటాయి. రోజు ప్రారంభంలో ప్రధానంగా కఫ దోషం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో పిత్త దోషం.. రాత్రి వాత దోషం యాక్టివ్‌గా ఉంటుంది. వాత దోషం కదలికతో సంబంధం కలిగి ఉంటుంది. గాలి, అంతరిక్ష అంశాలతో రూపొందించబడింది. ఇది శ్వాస, రక్త ప్రసరణ, విసర్జన వంటి శారీరక విధులను.. అలాగే క్రియేటివిటీ, కమ్యూనికేషన్ వంటి మానసిక విధులను నియంత్రిస్తుంది. వాత సమతుల్యంగా ఉన్నట్లయితే.. వ్యక్తి శక్తివంతంగా, సృజనాత్మకతతో అనుకూలత కలిగి ఉంటాడు. అందుకే వాత ఆధిపత్యం ఉన్న రోజును ప్రారంభించడం ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు నిపుణులు.

ప్రయోజనాలు ఏమిటి?

* బ్రహ్మముహూర్తంలో నాసికా రంధ్రాలు చురుకుగా ఉంటాయి. శ్వాస బాగా తీసుకోగలుగుతారు.

* ఈ టైమ్‌లో డిస్టర్బ్ చేసేవారు ఉండరు. అందువల్ల సృజనాత్మక అంశాలను ప్రతిబింబించడానికి, పని చేయడానికి గొప్ప సమయం.

* మెలటోనిన్ సహజ ఉత్పత్తి, పీనియల్ గ్రంధి స్రావం ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది.

* బ్రహ్మముహూర్త సమయంలో మనసు చురుకుగా ఉంటుంది. ఇంద్రియాలు అప్రమత్తంగా పనిచేస్తాయి.

* ఈ అలవాటు జీర్ణక్రియ, జీవక్రియను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక అవగాహన, అనుబంధాన్ని మెరుగుపరుస్తుంది.

మేల్కోలేని పక్షంలో టిప్స్..

* మొదట నిద్రవేళను సరిగ్గా సెట్ చేయండి. బ్రహ్మముహూర్త సమయంలో మేల్కొనాలి అనుకుంటే.. రాత్రి 10 గంటలకు నిద్రపోండి. శరీర జీవ గడియారాన్ని(సర్కాడియన్ రిథమ్) చాలా త్వరగా మేల్కొలపడానికి సెట్ చేయాలి. సమయానికి నిద్రపోతే మాత్రమే ఇది జరుగుతుంది.

* గదిలో పూర్తిగా చీకటిని కలిగి ఉండాలి. ఇలా చేస్తే గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అనుకున్న సమయంలో త్వరగా లేవడానికి హెల్ప్ అవుతుంది.

* రాత్రి తొమ్మిది గంటలలోపు మొబైల్ ఫోన్, టీవీ, టాబ్లెట్‌లను పక్కన పెట్టండి.

* బాగా నిద్రపోవడానికి రాత్రిపూట డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి.

* నిద్ర లేవాలనుకుంటున్న సమయాన్ని డైరీలో రాయండి. లేస్తానని మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. అలాంటప్పుడు అలారం అవసరం లేదు.


ఇవి కూడా చదవండి:

ఆపరేషన్‌లో హిప్నటైజ్‌.. వైద్యుల సరికొత్త మార్గం మంచికేనా?



Next Story

Most Viewed