వాతావరణ మార్పులకు అనుగుణంగా మారుతున్న పక్షులు

by Disha Web Desk 10 |
వాతావరణ మార్పులకు అనుగుణంగా మారుతున్న పక్షులు
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పక్షులు వలసలను వేగవంతం చేయడంతో ఆయా పరిస్థితులలో మనగలుగుతాయని ఓ అధ్యయనం పేర్కొంది. ప్రతీ వింటర్ సీజన్‌లో మిలియన్ల కొద్దీ పక్షులు వెచ్చని వాతావరణం ఉండే ప్రాంతాలకు, అలాగే సమ్మర్ సీజన్‌లో కూల్ వెదర్ ఉండే ప్రాంతాలకు వలసపోతుంటాయి. ఆకాశమార్గంలో ఎగురుకుంటూ వేల కిలోమీటర్లు జర్నీ చేస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. అయితే ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షపాతం, పర్యావరణ కాలుష్యం వంటి కొన్ని క్లైమేట్ చేంజ్ పరిణామాలు వలస పక్షులకు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. పరిశోధకులు ప్రకారం.. కొన్ని పక్షి జాతులు తమ శీతాకాలపు మైదానాల నుంచి వెళ్లిపోవడం ఆలస్యం చేస్తున్నాయి. తర్వాత సంభవించే మార్పులకు తట్టుకోలేక సాధారణంకంటే 43 శాతం వేగంగా ఎగురుతూ వలసపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో అవి తమ ఇంటెన్స్ జర్నీతో అలసిపోయి మృత్యువాత పడుతుంటాయని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ & సస్టైనబిలిటీలో ఎర్త్ కామన్స్ డైరెక్టర్ పీటర్ మర్రా పేర్కొన్నారు.

మైగ్రేషన్ డేటా ఏం చెప్తోంది?

కెనడా, కరేబియన్ మధ్య వలస వెళ్లే చిన్న సాంగ్ బర్డ్స్ (small songbird) అయినటువంటి ‘అమెరికన్ రెడ్‌స్టార్ట్’ పక్షులను పరిశీలించేందుకు పరిశోధకులు 33 ఏళ్ల వలసల డేటాను స్టడీ చేశారు. ఆటోమేటెడ్ రేడియో ట్రాకింగ్, లైట్-లెవల్ ట్యాగ్‌ల వంటి పరికరాల ద్వారా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్‌ను తెలుసుకోగలిగారు. లొకేషన్‌ను అంచనా వేయడానికి కూడా ఈ టెక్నాలజీ దోహదపడింది. అలాగే వాతావరణ మార్పులు పక్షుల నివాసాలపై, ఆహార లభ్యతపై ప్రభావం చూపుతున్నాయని కనుగొన్నారు. ఏటా వర్షపాతం తగ్గడంతో జమైకా ప్రాంతం పొడిగా మారడం కారణంగా ఇక్కడ పక్షులకు ఆహారంగా లభించే కీటకాలు తగ్గిపోతున్నాయి. కొన్నిసార్లు పక్షులు వలస వెళ్లేందుకు ఆలస్యం కావడానికి కూడా క్లైమేట్ చేంజ్ ప్రభావం కారణం అవుతోంది. ఇటీవల రెడ్‌స్టార్ట్‌ పక్షులు ఉత్తరం వైపు వలస వెళ్లేందుకు సుమారు 10 రోజులు ఆలస్యం చేశాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా ఆలస్యం కావడం కారణంగా తర్వాత ఒక్కసారిగా వెదర్ మారినప్పుడు పక్షులు ఆ ప్రభావంవల్ల వేగంగా ప్రయాణిస్తాయి. మార్గ మధ్యంలో తక్కువ స్టాప్‌ ఓవర్‌లను తీసుకోవడం ద్వారా ఇబ్బంది పడతాయి. అయినా అవి ఆ పరిస్థితులకు ఎదురీదుతూ గమ్యాన్ని చేరుకుంటాయి.

6 శాతం తగ్గిన మనుగడ

వాతావరణం లేదా పర్యావరణంలో మార్పులకు అనుగుణంగా పక్షులు ఉండగలవనే మాట నిజంగా సంతోషకరమైందని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ అడాప్టివ్ కెపాబిలిటీని పక్షులు ఎంతకాలం తట్టుకోగలుగుతాయో చూడాల్సిన అవసరం ఉందని కూడా కొందరు పేర్కొంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా చాలా పక్షులు మనగలుగుతున్నప్పటికీ పెరుగుతున్న వలసల వేగం, మారుతున్న క్లైమేట్ కారణంగా వాటి మొత్తం మనుగడ రేటులో 6 శాతం కంటే ఎక్కువ తగ్గుదలకు దారితీసిందని ప్రధాన అధ్యయనకర్త బ్రయంట్ డాస్మాన్ తెలిపారు. మైగ్రేషన్ సాంగ్ బర్డ్స్ ఒకటి లేదా రెండేళ్లు మాత్రమే మాత్రమే జీవిస్తాని, అవి ఏడాదికి ఒకసారి మాత్రమే సంతోనోత్పత్తి అవకాశాలు కలిగి ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య కూడా తగ్గిందని అంచనా వేశారు. అనేక పక్షి జాతులు వలస వెళ్ళడానికి భూ అయస్కాంత సూచనలను (magnetic cues)అనుసరిస్తాయి. హోమింగ్ పావురాల వంటి పక్షులు వాసన పసిగడుతూ నావిగేట్ చేస్తాయి.

దారితప్పిన వలస

పక్షుల్లో భూ ఆయస్కాంత శక్తిని బట్టి వలస వెళ్లడం వంటి స్కిల్స్ డెవలప్ కావడానికి అనేక మిలియన్ సంవత్సరాల కాలం పట్టిందని నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం వాతావరణ మార్పులు పక్షులను దశాబ్దాల వ్యవధిలోనే ప్రభావితం చేస్తున్నాయి. 2021 నుంచి ఇప్పటి వరకు జరిపిన ఒక అధ్యయనంలో ప్రకారం.. వాతావరణ మార్పులవల్ల కొన్ని రకాల పక్షులు ఉత్తరం నుంచి దక్షిణం వైపు కాకుండా, తూర్పు నుంచి పడమర వైపునకు వలస వెళ్తున్నాయి. 2021లో కరెంట్ బయాలజీలో పబ్లిషైన పరిశోధన ప్రకారం.. రిచర్డ్ పిపిట్స్, సాంగ్‌బర్డ్స్ ఆగ్నేయాసియాకు దిగువకు కాకుండా సైబీరియా నుంచి యూరప్‌లోకి వలసపోతున్నాయ. ఆగ్నేయాసియాలో హాబిటేట్ మాడిఫికేషన్, అర్భనైజేషన్ పెరుగుదల, బహిరంగ మైదానాలు కనుమరుగవడం వంటి వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణమని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.


Next Story

Most Viewed