Swiggy చేసిన పనికి రచయితకు భారీ షాక్..

by Disha Web Desk 21 |
Swiggy చేసిన పనికి రచయితకు భారీ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే భోజన ప్రియులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నాన్‌వెజ్ ఆర్డర్ చేస్తే వెజ్, వెజ్‌ ఆర్డర్ చేస్తే నాన్‌వెజ్ ఫుడ్స్‌ డెలివరీతో వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ప్యూర్ వెజ్‌‌టేరియన్ అయిన కోలీవుడ్‌ సాంగ్స్ రైటర్ కో శేషా పని నిమిత్తం బెంగుళూరులో స్టే చేశారు. అనంతరం స్విగ్గీలో గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. ఇక నచ్చిన ఫుడ్ రావడంతో వెంటవెంటనే ఓపెన్ చేసి సగం తినేశాడు. ఈ క్రమంలో అందులో ఏదో కొంచెం తేడాగా ఉండటంతో అతడి మిత్రులకు రుచి చూడమన్నాడు. దీంతో అది చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇవ్వగా.. ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. ఆపై స్విగ్గీ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించిన శేషాకు.. సదరు సంస్థ తమ ఆర్డర్‌పై తీసుకున్న రూ.70 వాపస్ చేస్తామని అతనికి చెప్పారు. దీంతో కోపగ్రస్తుడైన శేషా వేస్ట్ సర్వీస్ అంటూ సోషల్ మీడియాలో నిప్పులు చెలరేగాడు. స్విగ్గీ స్టేట్ హెడ్ క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే లీగల్‌గా కూడా వెళ్తానని పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లలో కొందరు శేషాకు మద్దతుగా నిలిచారు. ఈ వివాదంపై స్పందించిన స్విగ్గీ.. రెస్టారెంట్ పార్టనర్ వల్లే ఇటువంటి సమస్య ఏర్పడిందని.. తమ తప్పిదం కాదని తెలిపింది.


Next Story

Most Viewed