తస్మాత్ జాగ్రత్త!..రాత్రిపూట పడుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి

by Kavitha |
తస్మాత్ జాగ్రత్త!..రాత్రిపూట పడుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి
X

దిశ, ఫీచర్స్: సహజంగా మనం రాత్రిపూట శరీరానికి హాని కలిగించే అనేక పనులు చేస్తాము. అవి మన శరీరాన్ని లోపలి నుంచి తురుముతాయి. నిద్రకు ముందు కొన్ని పనులు చేయడం మన ఆరోగ్యానికి చాలా హానికరం అని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం.

రాత్రివేళ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి..

*మీరు రాత్రి లేటుగా నిద్రపోతే, మీ శరీరంలోని మొత్తం హార్మోన్ల వ్యవస్థ, ఎంజైమ్ బ్యాలెన్స్ కూడా తగ్గిపోయి జీవక్రియను నెమ్మదించి అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.

*పడుకునే ముందు సిగరెట్ తాగడం వల్ల మీరే వ్యాధులను ఏరికోరి తెచ్చుకున్నట్లు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*అలాగే చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. దీని వలన మనం తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అయి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకుండా కనీసం 10 నిమిషాలు నడవండి.

*చాలా మందికి రాత్రి పడుకునే ముందు టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. టీ, కాఫీలలో కెఫీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన బాడీకి ఐరన్, కాల్షియంను అందకుండా అడ్డుపడుతుంది. దీంతో శరీరానికి అవసరమైన ఖనిజాలు అందవు..

పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్దారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Next Story

Most Viewed