మటన్ లివర్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ముఖ్యంగా అమ్మాయిలకు!

by Disha Web Desk 9 |
మటన్ లివర్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ముఖ్యంగా అమ్మాయిలకు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జనాలు ఎక్కువగా నాన్‌వెజ్ తినడానికే మొగ్గుచూపుతున్నారు. చికెన్, మటన్, ఫిష్ ఇలా నాన్ వెజ్‌లో వెరైటీస్ ఉన్నప్పటికీ ముఖ్యంగా మటన్‌తోనే ఎక్కువ బెనిఫిట్స్ కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మటన్‌లో ఉండే అధిక కాల్షియం ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ వాటిని దృఢంగా చేస్తుంది. బీ కాంప్లెక్స్, సెలీనియం, కొలీనియం ఉండటం వల్ల క్యాన్సర్ నుంచి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మటన్‌లో పొటాషియం తగిన మోతాదులో ఉండటం వల్ల రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. అయితే తాజా అధ్యయనం ప్రకారం తరచూ మటన్ లివర్ తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మటన్‌ లివర్‌లో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి 12 ఫోలేట్, జింక్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

కాగా మటన్ లివర్ లో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయడానికి మేలు చేస్తుంది. అలాగే విటమిన్ బి 12 రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా అంటువ్యాధుకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మటన్ లివన్ తింటే ఆక్సిజన్‌ను రక్తం ద్వారా శరీరంలోని అన్ని పార్ట్స్‌కు తీసుకెళ్తుంది. రక్తహీనత ఉన్నవారు లివర్ తింటే ఎంతో సహాయపడుతుంది. ఈ లివర్‌లోని విటమిన్ ఎ స్కిన్ ఆరోగ్యాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. హెయిర్ స్ట్రాంగ్‌గా హెల్తీగా ఉంచేలా తోడ్పడుతుంది. అలాగే కండరాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా అలసటను తగ్గిస్తుంది. మటన్ లివర్‌లోని ఫోలేట్ ప్రెగ్నెన్సీ టైంలో నాడీ లోపాల ప్రమాదాన్ని తగ్గించడంలో మేలు చేస్తుంది.

Next Story

Most Viewed