సైలెంట్ గా ఉండిపో... ఆ సందర్భంలో మాట్లాడితే లైఫ్ ఖతమ్..

by Sujitha Rachapalli |
సైలెంట్ గా ఉండిపో... ఆ సందర్భంలో మాట్లాడితే లైఫ్ ఖతమ్..
X

దిశ, ఫీచర్స్: ప్రతి విషయంలో మనం మన ఒపీనియన్ చెప్పక్కర్లేదు అని పెద్దలు చెప్తూనే ఉంటారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఆలోచించి ప్రవర్తించాలని సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడకుండా ఉండటమే మంచిది అంటారు. అలా చేయడమే జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తుందని చెప్తారు. మరి అలాంటి సందర్భాలు ఏంటి? ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోవాలి? తెలుసుకుందాం.

* కోపంలో ఉన్నప్పుడు

కోపంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత బాధ పడేలా చేస్తాయి. ఎందుకంటే ఆగ్రహంతో ఉన్నప్పుడు బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదు.. ఆ క్షణాలు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోబడవు. కాబట్టి మనం తీసుకునే డెసిషన్ ఆ క్షణం జరిగిన వాగ్వాదంపై బేస్ చేసుకునే ఉంటుంది. కానీ అలాంటి నిర్ణయాలు లైఫ్ అంతా రిగ్రెట్ తో ఫీల్ అయ్యేలా చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో సైలెంట్ అయిపోవడం మంచిది.

* వాదన జరుగుతున్నప్పుడు

ఇద్దరు వ్యక్తుల మధ్య వాదన హీట్ పెంచేస్తుంది. నువ్వా నేనా అంటూ పరిస్థితి తారాస్థాయికి చేరిపోతుంది. ఆ బంధం విడిపోయేందుకు కారణం అవుతుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోండి. ఆ తర్వాత చర్చించండి. ఆ బంధాన్ని నిలుపుకోండి.

* క్లారిటీ లేనప్పుడు

ఒక విషయంలో క్లారిటీ లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. మీకు ఐడియా లేని అంశం గురించి మాట్లాడినప్పుడు గెస్ చేయడం లేదా గాసిప్ చేయడం మానేసి తెలియదని చెప్పండి. లేదంటే కామ్ అయిపోండి.

* విమర్శించబడుతున్నప్పుడు

మిమ్మల్ని ఒకరు అనవసరంగా క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు.. ప్రతి విషయంలో జడ్జ్ చేస్తున్నప్పుడు సైలెన్స్ మెయింటేన్ చేయండి. ఏమి మాట్లాడకుండా ఉండండి. ఆ టైంలో భరించి.. సమయం వచ్చినప్పుడు సమాధానం ఇవ్వండి.

Advertisement

Next Story

Most Viewed