పండుగ సమయంలో పీరియడ్సా? ఆపేందుకు చిట్కాలు

by Disha Web Desk 7 |
పండుగ సమయంలో పీరియడ్సా? ఆపేందుకు చిట్కాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మహిళ ఎదుర్కొనే ప్రధాన సమస్య పీరియడ్స్. ప్రతి నెల మహిళల్లో ఇది చాలా కామన్. ఇక ఈ పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి, మూడ్ స్వింగ్స్, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువ మంది మహిళల్లో సర్వసాధారణం. పీరియడ్స్ సమయంలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన సమయాల్లో పీరియడ్స్ ఆపుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువగా పండుగలకు, పెళ్లిళ్ళకు, బర్త్‌డేలకు పీరియడ్స్ ఆపుకునే ప్రయత్నంలో చాలా మంది టాబ్లెట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ టాబ్లెట్స్ వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కడుపులో నొప్పి పెరగడం, బలహీనపడడం, అలాగే హార్మోన్లలో హెచ్చుతగ్గులు లాంటివి వస్తుంటాయి. కాబట్టి నేచురల్ చిట్కాలు ఉపయోగించుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్పైసీ ఫుడ్: పీరియడ్స్ ఆపుకోవాలి అనుకుంటే కొన్ని రోజుల ముందు నుంచే స్పైసీ ఫుడ్‌కు కాస్త దూరంగా ఉండాలి. ఉందుకంటే.. ఎక్కువ కారం ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల రక్త ప్రవాహం పెరిగి తొందరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

నిమ్మరసం: నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే సి విటమిన్ అధిక రక్త ప్రవాహాన్ని నియంత్రించి పీరియడ్స్‌ను వాయిదా వేయడంలో సహాయ పడుతుంది. ఇందుకోసం రోజు 2 లేదా 3 స్పూన్ల నిమ్మరసాన్ని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇది అధిక బరువును కూడా తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

అజ్వైన్ ఆకులు: అజ్వైన్ ఆకుల్లో విటమిన్ బి12, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు రెండు తీసుకుని నీటిలో బాగా మరిగించి ప్రతిరోజు రెండు సార్లు తీసుకుంటే పీరియడ్స్ రావడం లేట్ అవుతుంది. అంతే కాకుండా ఈ ఆకుల్లో ఉండే విటమిన్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.



Next Story

Most Viewed