Cool water: ఎండలో వెళ్లొచ్చి కూల్ వాటర్ తాగుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదమంటున్నారు నిపుణులు..?

by Anjali |
Cool water: ఎండలో వెళ్లొచ్చి కూల్ వాటర్ తాగుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదమంటున్నారు నిపుణులు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎండలో వెళ్లొచ్చి చల్లని నీళ్లు తాగడం మంచిదే.. కానీ కొన్ని విషయాలు గుర్తుంచుకోకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయట పనిమీద వెళ్లొచ్చాక వెంటనే కూల్ వాటర్ తాగితే గుండెలోని సిరలు, రక్తనాళాలు చాలా ఇరుకుగా ఉంటాయి కాబట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా గోరువెచ్చని వాటర్ నెమ్మదిగా తాగాలని సూచించారు. చల్లని నీళ్లు తాగడం వల్ల శరీరానికి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. కానీ అది కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కూడా దారితీయవచ్చు.

ఎండలో వెళ్లొచ్చిన తర్వాత చల్లని నీళ్లు తాగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరిన్ని చిట్కాలు..

ఎండలో ఎక్కువసేపు గడిపితే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. చల్లని నీళ్లు తాగడం వల్ల శరీరానికి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. కానీ ఇది నీటి లోపాన్ని పూరించదు. కాగా చల్లని నీళ్లు తాగే బదులు.. సాధారణ ఉష్ణోగ్రత గల నీళ్లు తాగడం మేలు.

కడుపు నొప్పి..

చల్లని నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

జీర్ణక్రియ..

ఎండలో వెళ్లొచ్చి కూల్ వాటర్ తాగితే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి ఎండలో వెళ్లొచ్చిన తర్వాత వెంటనే చల్లని నీళ్లు తాగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

తలనొప్పి..

కొన్ని సందర్భాల్లో చల్లని నీళ్లు తాగడం వల్ల తలనొప్పి రావచ్చు.

డీహైడ్రేషన్..

చల్లని నీళ్లు తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది.

చల్లని నీళ్లు తాగే బదులు సాధారణ ఉష్ణోగ్రత గల నీళ్లు తాగాలి.

పుచ్చకాయ, అరటిపండు లాంటి పండ్లు తినాలి: ఇవి శరీరానికి నీటిని అందిస్తాయి.

మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి..

ఇవి శరీరానికి నీటిని అందిస్తాయి. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.



Next Story

Most Viewed