స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా చేయండి?

by Rajesh |
స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా చేయండి?
X

దిశ, వెబ్‌డెస్క్: స్ట్రెచ్ మార్క్స్ ప్రసవం తర్వాత మహిళలను ఎక్కువగా ఇబ్బంది పడుతుంటాయి. కొంత మంది బరువు పెరిగితే కూడా ఇవి ఏర్పడుతుంటాయి. వీటిని పోగెట్టేందుకు చాలా మంది అనేక రకాల క్రీములు వాడుతుంటారు. ఇక సహజ పద్ధతుల్లో వీటని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేస్తే మేలు.. కొబ్బరినూనెకు చర్మానికి తేమను అందించే గుణం ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్ చేయాలి. దీని వల్ల చారలు పోవడమే కాకుండా సాగిన పొట్ట తగ్గుతుంది. బంగాళ దుంప రసంలో పిండి పదర్ధాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని స్ట్రెచ్ మార్క్స్ పై రాసి టెన్ మినెట్స్ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే క్రమంగా మార్క్స్ తగ్గుతాయి. కలబంద గుజ్జు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటుంది. మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దురద, పొడిబారడం వంటి సమస్యల్ని తగ్గించి చర్మానికి తేమను అందించడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.కోడి గుడ్డు తెల్ల సోనను పావు చెంచా గ్లిజరిన్ తో కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేయాలి. అదయ్యాక చల్లని నీటితో కడిగితే చారల్ని తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ ని రోజూ ఉదయాన్నే సమస్య ఉన్న చోట రాస్తే ప్రసవ చారలు తగ్గుతాయి.



Next Story

Most Viewed