ముడతల మొఖం యవ్వనంగా మారాలంటే.. ఇదిగో అల్లం చిట్కా!

by Disha Web Desk 20 |
ముడతల మొఖం యవ్వనంగా మారాలంటే.. ఇదిగో అల్లం చిట్కా!
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్రలేమితో మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా చర్మంపైన ఆ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. అలాగే ముఖంపైన ముడతలు రావడం, చర్మం కాంతిని కోల్పోవడం జరుగుతాయి. ఈ సమస్య నుంచి బయట పడడానికి చాలా మంది మహిళలు బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం, లేదా మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్‌ని వాడుతుంటారు. వీటిని వాడడం ద్వారా చర్మం నిగనిగలాడుతూ కనిపించినా కొద్ది రోజులకు మళ్లీ ముందున్న సమస్యనే వస్తుంటుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ ప్రొడక్టులు పడని వారికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే మన వంటింట్లోనే ఎన్నో చిట్కాలు ఉన్నాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం..

మనం నిత్యం వంటిల్లో వాడే అల్లం కూరల్లో రుచిని తేవడం మాత్రమే కాదు.. ముఖం మీద ఉన్న ముడతలను కూడా తొలగిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. అందుకే అల్లంని ముఖానికి అప్లై చేయడం వలన ముఖం మీద ఉండే ముడతలు, ఫైన్ లైన్స్, తగ్గిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

అల్లంని ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలి..?

ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో 2 టీస్పూన్ల తేనె, 1 టీస్పూన్ అల్లం పొడి, 1 టీస్పూన్ పసుపు తీసుకుని అందులో కొన్ని రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకుని పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని పేస్ట్‌ని ముఖంపై అప్లై చేసుకోవాలి. ఆ తరువాత ఒక 10 నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి. కొద్దిసేపటి తరువాత సాధారణ నీటితో ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసుకుంటే చాలు.. మీ ముఖం పై ఉన్న ముడతలు అన్నీ పోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది.

Read more:

నిత్య యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా..! అయితే ఇవి తీసుకోవాల్సిందే

ఈ పార్ట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తీసుకోవాల్సిందే

వారానికి 6 గంటలే కలిసి ఉంటున్న కుటుంబాలు.. కారణం ఏంటో తెలుసా?

Next Story