- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. Siri AI వచ్చేసింది!
యాపిల్ Siri AIని ‘ప్రైవసీ-ఫస్ట్’గా రూపొందించింది. దీనిద్వారా యూజర్ డేటాకు ఎటువంటి ఢోకా ఉండదు. అది ఎక్కడా స్టోర్ చేయడం గానీ, షేర్ చేయడం గానీ చేయదు.

దిశ, ఫీచర్స్ : మీరు ఐవోఎస్ యూజర్లయితే ఇది గుడ్ న్యూస్.. ఏమిటంటే యాపిల్ తన డిజిటల్ అసిస్టెంట్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్(Siri)ను మెరుగైన ఫీచర్స్‌తో పూర్తిగా పునరుద్ధరించింది. ఇటీవల (జూన్ 8, 2026) జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఇంతకీ అదెలా పనిచేస్తుంది? బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పర్సనల్ విషయాల్లో కీ రోల్
యాపిల్ పునరుద్ధరించిన న్యూ Siri AI వ్యక్తిగత విషయాలను(personal context), సందర్భాలను కూడా బాగా అర్థం చేసుకొని, సంభాషణాత్మకంగా పనిచేస్తుంది. ఉదాహరణకు సామూహిక వనభోజనాలకు అందరూ ఏం తీసుకువస్తున్నారు? అని అడిగితే.. టెక్ట్స్ మెసేజ్‌ల నుంచి సమాచారం సేకరించి తెలియజేయడం, ఆ ఆహారానికి సరిపోయే డ్రింక్స్, ఇతర వివరాలను సూచించడం వంటివి చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా యాపిల్ ఇంటెలిజెన్స్ (Apple Intelligence) మీద ఆధారపడి పనిచేస్తుంది. ఐఫోన్, ఐపాడ్, కార్‌ప్లే (iPhone, iPad, CarPlay) వంటి అన్ని డివైజ్‌లలో డీప్‌గా ఇంటిగ్రేట్ అవుతుంది.
ప్రైవసీపై స్పెషల్ ఫోకస్
యాపిల్ Siri AIని ‘ప్రైవసీ-ఫస్ట్’గా రూపొందించింది. దీనిద్వారా యూజర్ డేటాకు కూడా ఎటువంటి ఢోకాలేదు. ఎందుకంటే అది ఎక్కడా స్టోర్ చేయడం గానీ, షేర్ చేయడం గానీ చేయదు. గూగుల్ జెమిని మోడల్స్‌ను ఉపయోగించినప్పటికీ, అవి పబ్లిక్ వెర్షన్లు కావు. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్(Private Cloud Compute) ద్వారా క్లౌడ్‌లో కూడా డేటా భద్రతను నిర్ధారిస్తుంది. సిస్టమ్ ఆర్కెస్ట్రేటర్ అనే టెక్నాలజీ ద్వారా క్వెరీలను డివైజ్ లేదా క్లౌడ్‌కు సరైన విధంగా రూట్ చేస్తుంది.
చాట్‌బాట్ కాదు, సిస్టమ్ ఇంటిగ్రేషన్
యాపిల్ పునరుద్ధరించి కొత్త ఏఐ ఆధారిత సిరిని వేరే చాట్‌బాట్‌గా పిలవడం లేదు. ఇది సిస్టమ్ అనుభవంలో భాగంగా, స్క్రీన్‌పై ఉన్నదాన్ని అర్థం చేసుకొని పనిచేసే ఇంటిగ్రేటెడ్ టూల్. ప్రత్యేక సిరి యాప్ (Siri App) ద్వారా మునుపటి సంభాషణలను సేవ్ చేసుకొని, తిరిగి చూడవచ్చు లేదా కొనసాగించవచ్చు. అంతేకాకుండా ఇది యూజర్ ఫొటోలు, మెసేజ్‌లు, నోట్స్ వంటి పర్సనల్ కంటెంట్‌ను సురక్షితంగా ఉపయోగించి రోజువారీ పనులను సులభతరం చేస్తుంది. మొత్తానికి యాపిల్ సిరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్మార్ట్‌నెస్, పర్సనల్ టచ్, గ్రేట్ ప్రైవసీని కలిపి సిరి ఏఐని పునరుద్ధరించింది. మొత్తానికి సిరినిని సాధారణ అసిస్టెంట్ నుంచి శక్తివంతమైన, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌గా మార్చేసింది. iOS 27 బాటాలో కూడా ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.






