నా చిన్ననాడు అదో పీడకల.. అంబేద్కర్ ఉత్తరంలో రాసినవి చూస్తే కన్నీరు ఆగవు!

by Jakkula Samataha |
నా చిన్ననాడు అదో పీడకల.. అంబేద్కర్ ఉత్తరంలో రాసినవి చూస్తే కన్నీరు ఆగవు!
X

దిశ, ఫీచర్స్ : నేడు అంబేద్కర్ జయంతి. డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈయన అనగారిన వర్గాల కోసం ఎంతగానో పోరాటం చేశాడు. కాగా, ఈయనకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈయన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో 1891 ఏప్రిల్14న జన్మించారు.అతను వారి తల్లిదండ్రులకు 14వ చివరి సంతానం. అతని తండ్రి సుబేదార్ రామ్‌జీ మాలోజీ సక్పాల్, అతను బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. ఆయన రాసిన ఓ ఉత్తరంలో కొరేగావ్ ప్రయాణం గురించి రాశారు. నా చిన్ననాటి జీవితంలో అదో పీడకల అని తెలిపారు. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అంబేద్కర్.. మా నాన్న కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి ఆర్మీలో చేరారు. అధికారి హోదాకు ఎదిగి, సుబేదార్‌గా పదవీ విరమణ చేశాడు. పదవీ విరమణ చేశాక దాపోలిలో స్థిరపడాలని అనుకున్నాడు. మా కుటుంబాన్ని అక్కడికి తీసుకువెళ్లాడు. కానీ కొన్ని కారణాల వల్ల మనసు మార్చుకున్నాడు. మా కుటుంబం దాపోలి నుండి సతారాకు మారింది. మేం 1904 వరకు అక్కడే నివసించాం. నేను రాస్తున్న మొదటి సంఘటన ఇది. నాకు గుర్తున్నంత వరకూ రాస్తున్నా. సుమారు 1901 సంవత్సరంలో ఇది జరిగింది. అప్పుడు మేం సతారాలో ఉన్నాం. అప్పటికి మా అమ్మ చనిపోయింది. మానాన్న కొరెగావ్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. మమ్ముల్ని మా అత్తమ్మ దగ్గర వదిలేశాడు. తనకు రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. ఆమెను మేము ఎత్తుకెళ్లి తన పనులు చేయించే వాళ్లం. ఆ పరిస్థితి అంత దారుణంగా ఉండేది. ఒక సారి వేసవి సెలవులకు మా నాన్న మమ్మల్ని కొరెగావ్ రమ్మన్నారు. మేము చాలా సంతోషంగా వెళ్లాం. కానీ ఆ ప్రయాణం మా జీవితంలో పీడకలగా మారింది. మేము రైల్వేస్టేషన్‌కు వెళ్లి, టికెట్స్ తీసుకొని మా నాన్న కోసం ఫ్యూన్ కోసం ఎదురు చూశాం కానీ ఎవరూ రాలేదు. అలా ఒకరోజు మొత్తం రైల్వేస్టేషన్‌లోనే గడిపాము. తర్వాత ఎడ్లబండిలో మా ప్రయాణం సాగించాం..చాలా ఆకలిగా ఉంది తినడానికి కూడా ఏం లేదు. ఎవరినైనా ఏదైనా అడుగుదామంటే అంటరాని వాళ్లు అని చిన్న చూపు. రెండు రోజులు ఎండ్ల బండిలోనే మా ప్రయాణం సాగింది. నీటికోసం ఎంతో అల్లాడి పోయాము, మాకు కొంచెం దూరంలో టోల్-కలెక్టర్ గుడిసెకు కనిపించింది. అక్కడికి చేరుకున్నాం. చాలా దాహంగా ఉందని కొన్ని నీళ్లు ఇస్తారా అని అడిగాను, దానికి బదులుగా ఆయన మీరు ఎవరు అని అడిగితే ముస్లిం అని సమాధానం ఇచ్చాను. దానికి ఆయన నమ్మనట్లుగా.. మీకు నీళ్లు ఇక్కడ కాదు, కొండ మీద ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఈ విషయం మా అన్నకు చెప్పాను, తాను మనసులో ఏం అనుకున్నాడో తెలియదు. దాహం, ఆకలితోనే మేము కొరేగావ్ చేరుకున్నాం.మా నాన్న మమ్మల్ని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే మేము వస్తున్నట్లు మా నాన్నకు ఆయన ఫ్యూన్ చెప్పలేదు. ఇక ఈ ప్రయాణంలో మేము ఎన్నో బాధలు పడ్డాం, అడ్డంకులను ఎదుర్కొన్నాం, చివరకు అంటరాని వారిని చూసే చిన్న చూపు మమ్ముల్ని ఎక్కువగా కలిచి వేసింది. ఇక్కడే కాదు బడిలో, ఊరిలో మమ్ముల్ని చూసే విధానం అలాగే ఉంటుంది అని రాసుకొచ్చాడు.



Next Story

Most Viewed