అలర్జీ ఉన్న వారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

by Disha Web Desk 10 |
అలర్జీ ఉన్న వారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వంద మందిలో 50 మంది అలర్జీ సమస్యతో బాధ పడుతుంటారు. ఇది వినే వారికి ఏమి అనిపించకపోవచ్చు. కానీ ఈ సమస్యతో బాధ పడే వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏది అయినా ఆహారం తీసుకున్నపుడు మీకు చర్మ సమస్యలు వస్తే.. అది అలర్జీ కావచ్చు. దీనితో పాటు డస్ట్ అలర్జీలు, ఆహార అలెర్జీలు ఇలా ఒకటి కాదు అనేక అలర్జీలు ఉన్నాయి. వీటి కారణంగా మొటిమలు, దద్దుర్లు, జలుబు-దగ్గు, తుమ్ముల వస్తుంటాయి. అలెర్జీలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ అలెర్జీలు ఉన్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఆహార అలెర్జీలు

కొంతమందికి వేరుశెనగ, గుడ్లు, పాలు, చికెన్ ఆహారాలు తీసుకున్నప్పుడు అలెర్జీ వస్తుంది. వీటిని తిన్నప్పుడు దురద, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. పడనవి తీసుకున్నప్పుడు అలెర్జీ వస్తుంటే వాటికి దూరంగా ఉంటేనే మంచిది.

చర్మ అలెర్జీలు

కొంత మందికి దుస్తులు, లోషన్లు వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. ఇది చర్మ అలెర్జీకి సంకేతాలు కావచ్చు. అలెర్జీలు ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటాయి. కొంతమందికి ఒక రకమైన అలెర్జీ మాత్రమే ఉండవచ్చు. మరి కొంతమందికి అనేక అలెర్జీలు ఉంటాయి. మీకు అలెర్జీ ఉందని అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి.

Read More: Hormonal Imbalance: హార్మోన్లను ఈ విధంగా గాడిలో పెట్టొచ్చు!


Next Story

Most Viewed