ఈ పనులు చేసి.. వినాయకుడి మండపాల్లోకి వెళ్తున్నారా? అయితే మహాపాపం!

by Anjali |
ఈ పనులు చేసి.. వినాయకుడి మండపాల్లోకి వెళ్తున్నారా? అయితే మహాపాపం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు. హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. గణాలకు అధిపతి అయిన ఈ దేవుడికి.. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ఎంతో ఘనంగా భక్తితో పూజలు చేసి.. అనంతరం గంగమ్మ ఒడికి చేరేస్తాం. ఇక సంవత్సరం వినాయక చవితి తేదీలో సందిగ్ధత ఏర్పడింది. కొన్ని క్యాలెండర్లో సెప్టెంబరు 18 అని ఉండగా.. మరికొన్నింట్లో 19 అని ఉంది. కాగా ఈ రెండ్రోజుల్లో ఏ రోజైనా పండగ చేసుకోవచ్చని పండితులు క్లారిటీ ఇచ్చారు. దీంతో మన తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబరు 18 వ తేదీన జరుపుకుంటున్నారు. అయితే 9 రోజులు ఎంతో నిష్టగా పూజించే వినాయకుడున్న గుళ్లలోకి వేళ్లే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కాగా మద్యం సేవించి, మాంసాహారం తిని, చావు ఇళ్లను దర్శించి, స్నానం చేయకుండా మండపాలకు వెళ్లకూడదని చెబుతున్నారు.Next Story

Most Viewed