ఎసిడిటీ సమస్యకు వీటితో సులభంగా చెక్ పెట్టొచ్చు!

by Disha Web Desk 10 |
ఎసిడిటీ సమస్యకు వీటితో సులభంగా చెక్ పెట్టొచ్చు!
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో, చాలా మంది అధిక రక్తపోటు, బలహీనత, ఎముకల నొప్పి , అలసట వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే దీనికి కారణం. మనం తినే ఆహారంలో మన శరీరానికి కావలసిన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని హానికరమైన వ్యాధుల నుండి రక్షించుకోవచ్చని నిపుణులు అంటున్నారు: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలంటే, ప్రతిరోజూ ఉదయం నీటిలో నానబెట్టిన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.

బాదం

బాదంలో విటమిన్‌ బి, మెగ్నీషియం అధికంగా లభిస్తాయి. దీనిలో ఉండే పోషకాలు మీ శరీరం శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బాదంను నానబెట్టడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

ఎండుద్రాక్ష

ఈ ఎండుద్రాక్షలో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని నానబెట్టి తింటే శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండుద్రాక్షను సోంపులో రాత్రంతా నానబెట్టి తీసుకోవడం ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది.

మెంతులు

మెంతులు అధిక మొత్తంలో ఫైబర్‌ను అందిస్తాయి. ఇది ప్రేగులను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.

అవిసె గింజలు

అవిసె గింజలలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. నీటిలో నానబెట్టిన అవిసె గింజలను తీసుకుంటే, కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం కూడా దూరమవుతుంది.

Read More..

పిల్లల్లో ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ఏంటో తెలుసా..?

Next Story

Most Viewed