మార్కెట్‌లో దొరికే మామిడిపండ్లు సహజంగా పండినవేనా?.. కెమికల్ మిక్స్ చేశారా?.. ఇదిగో ఇలా గుర్తు పట్టవచ్చు

by Dishafeatures2 |
మార్కెట్‌లో దొరికే మామిడిపండ్లు సహజంగా పండినవేనా?.. కెమికల్ మిక్స్ చేశారా?.. ఇదిగో ఇలా గుర్తు పట్టవచ్చు
X

దిశ, ఫీచర్స్ : వేసవిలో మాత్రమే లభించే సీజనల్ పండ్లలో మామిడి ఒకటి. ఎల్లప్పుడూ దొరకదు, పైగా రుచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం ఒకప్పటిలా సహజ సిద్ధంగా పండిన ఒరిజినల్ మామిడి పండ్లు దొరకడం లేదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మార్కెట్లో లభించే పండ్లన్నీ ఒరిజినల్ కావని, రసాయనాలు మిక్స్ చేసి మాగ పెడతారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. అందుకే అవి రుచిగా ఉండవని, తిన్న తర్వాత నోరంతా పాడవుతుందని చెప్తున్నారు. అయితే అవి సహజంగా పండాయా? లేదా కెమికల్స్ మిక్స్ చేయడం ద్వారా పండ్లు అయ్యాయా? అనేది తెలుసుకోవచ్చు అంటున్నారు పెద్దలు, నిపుణులు. అదెలాగో చూద్దాం.

* మామిడి కాయలను త్వరగా పండ్లు చేసిన సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో కొందరు వాటిని కృత్రిమ పద్ధతుల్లో మాగబెడుతుంటారు. అంటే కాల్షియం కార్బైడ్ పౌడర్ వాటిపై చల్లడం ద్వారా పండ్లుగా మారుస్తారు. ఇలా కెమికల్స్ ద్వారా పండిన వాటిని తినడంవల్ల తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అయితే ఒక సింపుల్ చిట్కా ద్వారా కొనే ముందు మామిడి పండు రసాయనాలతో పండించారో లేదా తెలుసుకోవచ్చు. అందుకోసం బకెట్‌లో కొన్ని నీళ్లు తీసుకోండి. అందులో మామిడి పండును వేయండి. అది నీటిలో మునిగితే గనుక సహజంగా పండినట్లు లెక్క. నీటిలో తేలితే కెమికల్స్ మిక్స్ చేయడం ద్వారా పండిందని అర్థం.

* కలర్‌ను బట్టి కూడా మామిడి పండ్లు సహజంగా పండాయో, కృత్రి పద్ధతితో రసాయనాల ద్వారా పండించారో గుర్తు పట్టవచ్చు. ఉదాహరణకు పండు పైభాగం అక్కడక్కడా పచ్చగా ఉండి, మిగతా భాగం అంతా ఎల్లో కలర్‌లో ఉంటే.. అది కెమికల్స్ మిక్స్ చేయడం ద్వారా పండ్లుగా మార్చారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా పండిన మామిడి పండు ఆకుపచ్చ లేదా పసుపు పచ్చ కాంబినేషన్‌లో ఉంటుంది.

* రసాయనాల ద్వారా పండిన మామిడి పండును కట్ చేసినప్పుడు పై భాగానికి, లోపలి గుజ్జు భాగానికి సంబంధమే ఉండదు. ముందుగానే విడిపోయి ఉన్నట్లు కనిపిస్తాయి. ఏదో పురుగులు కొరికినట్లు, కొంత భాగం చెడిపోయినట్లు కూడా అనిపిస్తుంది. దీనిని బట్టి కెమికల్స్ కలిపారని అర్థం చేసుకోవచ్చు. సహజంగా పండింది అయితే పసుపు రంగులో గుజ్జు పాడవకుండా కనిపిస్తుంది. సహజంగా పండిన పండ్లలో కొన్నింటిపై అక్కడక్కడా బ్రౌన్ కలర్ మచ్చలు కూడా కనిపిస్తాయి. కెమికల్స్ ద్వారా పండినవి అయితే అందుకు భిన్నంగా తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. కాబట్టి పండ్లు కొనేముందు ఎంతకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Read More..

ఏం వర్షాలురా బాబు.. ఎడారి కూడా పచ్చగా మారిపోయింది.. బైబిల్‌లో చెప్పినట్లుగానే..

Next Story

Most Viewed