మొబైల్ వీక్ ఆఫ్ తీసుకోండి.. లేదంటే పిచ్చోళ్లు అయిపోతారు

by Sujitha |
మొబైల్ వీక్ ఆఫ్ తీసుకోండి.. లేదంటే పిచ్చోళ్లు అయిపోతారు
X

దిశ, ఫీచర్స్: నేటి హైపర్‌కనెక్ట్ వరల్డ్ లో అధిక సమాచారంతో దూసుకుపోతున్నాము. ఇమెయిల్‌, న్యూస్ అలర్ట్స్, సోషల్ మీడియా అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ మన అటెన్షన్ కోసం పోటీ పడుతున్నాయి. కాదనలేని కన్వీనియన్స్, కనెక్షన్ అందిస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి డిస్ కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఆందోళన, ఒత్తిడికి గురిచేస్తుంటాయి. అందుకే డిజిటల్ డిటాక్స్ అవసరమని సూచిస్తున్నారు నిపుణులు. బాడీ, బ్రెయిన్ కు ఈ ఆన్ లైన్ నోటిఫికేషన్ల నుంచి విశ్రాంతి అవసరమని.. నిజంగా మనకు మఖ్యమైన వ్యక్తులతో కనెక్ట్ అయి, రీచార్జ్ అయ్యేందుకు.. టెక్నాలజీ బ్రేక్ ముఖ్యమని అంటున్నారు.

మానవ మెదడు డిజిటల్ యుగంలో మనం ఎదుర్కొనే అనవసర సమాచారంతో కలుగుతున్న ఒత్తిడి కోసం రూపొందించబడలేదు. నిజానికి ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ అయిపోయి.. డెసిషన్ తీసుకునే సామర్థ్యం బలహీనపడుతుందని.. ఆందోళన, డిప్రెషన్ పెరగడానికి దారితీస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. దీంతో మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి వర్క్ చేయకుండా.. విశ్రాంతి తీసుకోవడానికి మొగ్గు చూపుతుంది. అందుకే మన శరీరాలు సరిగ్గా పనిచేయడానికి నిద్ర అవసరం అయినట్లే, మన బ్రెయిన్ కు డిజిటల్ ప్రపంచం అందిస్తున్న సమాచారం, నోటిఫికేషన్స్ నుంచి విరామం అవసరం. ఇందుకోసం డ్రాస్టిక్ చేంజేస్ కూడా అవసరం లేదు. టెక్ ఫ్రీ ఈవినింగ్స్, మొబైల్ ఫ్రీ డిన్నర్ టైమింగ్, బెడ్ రూంకి ఫోన్ అలో చేయకపోతే చాలు అంటున్నారు నిపుణులు.

టెక్నాలజీ బ్రేక్ బెనిఫిట్స్

* ఫోకస్, ప్రొడక్టివిటీ పెరుగుదల

నిరంతరం మల్టిటాస్కింగ్, ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ కావడంతో ఒక పనిపై కాన్సంట్రేట్ చేయలేకపోతుంటాం. అయితే డిజిటల్ డిటాక్స్ మన బ్రెయిన్ త్ నోx. Cz ఒత్తిడి తగ్గించి..చేతిలో ఉన్న పని మీద దృష్టిపెట్టేలా చేస్తుంది. సామర్థ్యాన్ని పెంచి.. మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది.

* ఒత్తిడి, ఆందోళన తగ్గుదల

కనెక్ట్ కావాలనే నిరంతర ఆలోచన, ఏదో మిస్ అయిపోతున్నమనే భయం.. ఒత్తిడికి దారితీస్తుంది. అయితే టెక్నాలజీ అన్ ప్లగింగ్ .. డిజిటల్ వరల్డ్ యంగ్జటీ నుంచి డిస్ కనెక్ట్ కావడానికి, ప్రశాంతమైన క్షణాలను గడపడానికి హెల్ప్ చేస్తుంది.

* క్రియేటివిటీ పెరుగుదల

మన మెదడు నిరంతరం సమాచారంతో నిండిపోయినప్పుడు.. సృజనాత్మకత తగ్గిపోతుంది. అయితే టెక్నాలజీ నుండి డిస్‌కనెక్ట్ చేయడం వల్ల బ్రెయిన్ కొత్త ఆలోచనలు రేకెత్తించడానికి అనుమతిస్తుంది.

* స్ట్రాంగర్ రిలేషన్ షిప్స్

డిజిటల్ డివైజెస్ రియల్ లైఫ్ కనెక్షన్స్ అడ్డుకుంటాయి. స్క్రీన్‌పై తక్కువ సమయాన్ని వెచ్చించడం వల్ల మన చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం కేటాయించగలం. లోతైన, మరింత అర్థవంతమైన బంధాలను మెయింటైన్ చేయగలం.

డిజిటల్ డిటాక్స్ అంటే టెక్నాలజీకి పూర్తిగా దూరంగా ఉండటం కాదు. మన లైఫ్ గ్రోత్ అయ్యే టూల్ గా ఉపయోగించడం. మనను కంట్రోల్ చేసే సాధనంగా కాకుండా చూసుకోవాలి. అందుకే స్పెస్సిఫిక్ టెక్ ఫ్రీ టైమింగ్స్, డేస్ సెట్ చేసుకోవాలి. నోటిఫికేషన్స్ సైలెంట్ లో పెట్టేసి.. ప్రత్యామ్నాయ పనుల్లో నిమగ్నం అయిపోవాలి. స్క్రీన్లకు దూరంగా ఉంటూ అన్ ప్లగ్ పవర్ ఎంజాయ్ చేయండి.

Next Story

Most Viewed