- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మెటల్ డిటెక్టర్‌తో నదిలోకి దిగిన యువతి.. ఆ తర్వాత కొద్దిసేపటికే..
దిశ, ఫీచర్స్ : మనుషుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఆసక్తి ఉంటుంది. ప్రపంచాన్ని చుట్టేస్తూ అందమైన ప్రదేశాలు చూడాలని కొందరు అనుకుంటే.. ఈ భూమిపై పురాతన వస్తువులను, చారిత్రక ఆనవాళ్లను అన్వేషించడమే హాబీగా మరికొందరు ప్రయత్నిస్తుంటారు. ఎవరికీ తెలియని కొత్త విషయాలను బయటి ప్రపంచానికి తెలియజేస్తుంటారు. సరిగ్గా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన అన్వేషణలో భాగంగా మెటల్ డిటెక్టర్‌తో నదిలోకి దిగిన యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైరల్ సమాచారం ప్రకారం.. ఇంగ్లండ్‌కు చెందిన జేన్ (jane) అనే యువతి పురాతన నాణేలు, భూమిలో పాతి పెట్టిన నిధి నిక్షేపాల సేకరణే తన వృత్తిగా ఎంచుకుంది. ఆమె తన టీమ్‌తో కలిసి సముద్రాలు, పురాతన కట్టడాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో చారిత్రక ఆనవాళ్లు, పురాతన వస్తువులు ఏమైనా లభిస్తాయేమోనని అన్వేషిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె మెటల్ డిటెక్టర్ పట్టుకొని ఇంగ్లండ్‌లోని ఓ నదిలో వెతకడం ప్రారంభించింది. కొద్ది సేపటి తర్వాత ఆ మెటల్ డిటెక్టర్ సౌండ్ చేస్తూ అక్కడ ఏదో ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో జేన్ నదిలోపలి భాగంలో రాళ్లను డిటెక్టర్‌తో పక్కకు జరిపి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అక్కడ కనిపించింది డైమండ్ రింగ్. ‘నదిలో దొరికిన వజ్రాలు ఎప్పటికీ అద్భుతమే’ అనే క్యాషన్‌తో ‘మై ఆర్డినరీ ట్రెజర్’ అనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోను షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. కాగా అది 1970 కాలం నాటి ఎంగేజ్ మెంట్ రింగ్ అయి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
Video Credits to ‘my ordinarytreasure’ Insta Id