- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Viral Video: బైక్‌తో రైల్ ఇంజన్‌నే లాగడానికి ప్రయత్నించిన యువకుడు.. అంతలోనే షాక్ !
దిశ, ఫీచర్స్ : ఓ వైపు ప్రమాదాలు జరుగున్నా, రిస్క్ అని తెలిసినా కొందరిలో రీల్స్ పిచ్చి ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనో, ఎక్కువ లైక్‌లు, షేరింగ్‌లు సొంతం చేసుకోవాలనో వెరైటీ స్టంట్లు చేస్తున్నారు. సరదా కోసం హెల్తీ రీల్స్ చేస్తే పర్లేదు కానీ.. ప్రాణాలు సైతం పణంగా పెట్టడమే ఇక్కడ సమస్యగా మారుతోంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాధ్యం అవుతుందా.. కాదా? అనే దానితో సంబంధం ఓ యువకుడు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
రైల్వే ట్రాక్‌పై ఆగి ఉన్న ట్రైన్ వద్దకు ఓ యువకుడు నంబర్ ప్లేట్ కూడా సరిగ్గా కనబడని బైక్‌తో వచ్చాడు. అంతటితో ఆగకుండా ట్రైన్ ముందు భాగానికి కట్టి ఉన్న వైర్‌ను తన బైక్‌కు కట్టి, దాని సహాయంతో ట్రైన్‌నే లాగే ప్రయత్నం చేశాడు. అయితే ఆ యువకుడు బండి స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా దాని ముందు భాగం పైకిలేచింది. కొంచెమైతే కిందపడేవాడు. కానీ ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకున్నాడు. పైగా హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీల్స్ పిచ్చి ఇప్పుడు గ్రామాలకు కూడా పాకిందని కొందరు, ఎంత చెప్పినా కొందరు మారడం లేదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా వైరల్ వీడియోలోని సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోబంద్ రూర్కీ రైల్వే లైన్‌లో జరిగినట్లు, అందుకు సంబంధించి కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.