- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Brain Cancer : స్మార్ట్ ఫోన్ల వాడకానికి, బ్రెయిన్ క్యాన్సర్‌కు సంబంధం లేదు.. డబ్ల్యుహెచ్‌ఓ అధ్యయనంలో వెల్లడి
దిశ, ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా సమాచారాన్ని, విజ్ఞాన్ని అందించే చిన్నపాటి ప్రపంచంగా మారింది. అయితే తరచుగా ఫోన్ వాడటంవల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చాలా మంది హెచ్చరిస్తుంటారు. కాగా ఇందులో ఎలాంటి నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యయనంలో వెల్లడైంది.
మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని నిరూపించదగ్గ ఆధారాలు ఏవీ లభించలేదని డబ్ల్యుహెచ్‌ఓ స్పష్టం చేసింది. స్టడీలో భాగంగా సుదీర్ఘంగా ఫోన్ మాట్లాడేవారిని, దశాబ్దానికి పైగా మొబైల్ ఫోన్ వాడేవారిని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 11 మంది పరిశోధకులు అబ్జర్వ్ చేశారు. అలాగే 1994 నుంచి 2022 వరకు నిర్వహించిన 63 అధ్యయనాలను కూడా విశ్లేషించారు. ప్రపంచంలో వైరల్‌లెస్ టెక్నాలజీ విస్తృతంగా పెరిగినప్పటికీ బ్రెయిన్ క్యాన్సర్ల పెరుగుదల మాత్రం ఆ స్థాయిలో లేదని ఈ సందర్భంగా పరిశోధకులు గుర్తించారు. కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్‌కు, స్మార్ట్‌ఫోన్ల వాడకానికి సంబంధం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇచ్చింది.