చేపలకు గోరుముద్దలు పెడుతున్న బాతు.. వీడియో వైరల్

by Disha Web Desk 8 |
చేపలకు గోరుముద్దలు పెడుతున్న బాతు.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక వింతలు వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు కూడా క్షణాల్లో మన ముందు ఉంటున్నాయి. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఎన్నో వీడియోలు మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి.

ఇక తాజాగా ట్విట్టర్‌లో బాతు, చేపలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనకు ఉన్న దాంట్లో కొంత ఇతరులకు పెట్టడంలో ఉన్న తృప్తి మరేదానిలో రాదు అంటారు. అయితే ఓ బాతు తాను ఆహారం తింటూ తన దగ్గరిలో ఉన్న చేపలకు కూడా తాను తినే ఆహారం గింజలను ఒకొక్కటిగా ఇస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు, బాతు, చేపల స్నేహం సూపర్ అని కొందరు కామెంట్స్ చేయగా, మరికొందరు అమ్మ గోరుముద్దలు పెట్టినట్లు పెడుతుంది బాతు, ప్రేమ ఉంటే ఈ ప్రపంచంలో చేయలేనిది ఏదీ లేదు, అంటూ బాతు మనసును కీర్తిస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పాత వీడియో అయినా ఇది మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది.


Next Story