గద్ద నోటికి చిక్కిన పాము.. కట్ చేస్తే యముడికి షేక్‌హ్యాండ్ !

by Kavitha |
గద్ద నోటికి చిక్కిన పాము..  కట్ చేస్తే యముడికి షేక్‌హ్యాండ్ !
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇక అందులో పాముకి సంబంధించిన వీడియోలు అయితే మరీను. మనకు ఒక సమస్య ఎదురైనప్పుడు భయపడి వెనుక అడుగు వేయకుండా సమస్యనే భయపడేలా ఎదురెళ్లి మరీ తలపడాలి అనే రీతిలో ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో భాగంగా గద్ద నోటికి చిక్కిన ఓ పాము ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో ఉన్నది.. అయితే వెంటనే తేరుకుని పాము తన వ్యూహాన్ని మార్చి.. గెద్దను బిగించి ఉక్కిరిబిక్కిరి చేసింది. గద్ద తల భాగాన్ని పాము చుట్టేసి గట్టిగా తన పట్టు బిగించింది. దానితో ఊపిరాడక గద్ద తన మెడ వెనక్కి వాల్చేసింది. ఏం చెయ్యాలో తెలియక.. పామును వదల్లేక.. సతమతమై పోయింది గద్ద. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed