విజయవాడ ప్రజలకు అరుదైన అవకాశం

by Disha Web Desk 10 |
విజయవాడ ప్రజలకు అరుదైన అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్ : విశ్వంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి . అలాగే మనల్ని ఆశ్చర్య పరచే విషయాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. వేల సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైన అద్భుతం…ఈ నెలలో మనకి కనిపించబోతుంది. తారలను చూస్తుంటే మన మనస్సుకి ఎదో తెలియని సంతోషంగా అనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితం కనిపించిన తార మనల్ని మురిపించబోతుంది. ఆకాశంలో మనకి కనిపించబోయే నక్షత్రం పేరు గ్రీన్‌ కొమెట్‌ తోక చుక్క. ఈ తోక చుక్కను అందరు చూడలేరట. ఆ అదృష్టం మనకి కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మరికొద్ది గంటల్లో ఈ తోకచుక్క మెరవబోతుంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు అంటే నాలుగు రోజులు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం మనకి లభించింది . 50,000 ఏళ్ల క్రితం ఈ తోక చుక్క మెరిసిందట.. మళ్లీ ఇప్పుడు మరోసారి మనముందు ఈ అద్భుతం మనకి కనిపించబోతుంది.

Next Story

Most Viewed