క్రియేటివిటీని అన్‌లాక్ చేయడంలో నిద్ర ఎలా ఉపయోగపడుతుంది..?.. అధ్యయనం

by Disha Web Desk 13 |
క్రియేటివిటీని అన్‌లాక్ చేయడంలో నిద్ర ఎలా ఉపయోగపడుతుంది..?.. అధ్యయనం
X

దిశ, ఫీచర్స్: ముందటిరోజు ప్రశాంతంగా నిద్రపోయిన వారు మరుసటిరోజు యాక్టివ్‌గా ఉంటారు. వారు చేసే పనిలో కూడా క్రియేటివిటీ ప్రదర్శిస్తారు. ఇది చాలామందికి అనుభవమే అయినప్పటికీ క్రియేటివిటీని అన్‌లాక్ చేయడంలో నిద్ర ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో సైంటిస్టులు అధ్యయనం కొనసాగించారు. నిజానికి ప్రజలు క్రియేటివిటీని ఇష్టపడుతుంటారు. అయితే పరిశోధనలో భాగంగా దీనిని పెంపొందించడానికి, అలాగే స్ట్రెస్ రిలేటెడ్ బ్యాడ్ డ్రీమ్స్ ( పీడకలలు) కు ట్రీట్‌మెంట్ చేసేందుకు కొత్త మార్గాలకు దారితీస్తుందని కొత్త అధ్యయనం పేర్కొన్నది. ప్రజలు ప్రశాతంగా నిద్రపోయిన తర్వాత సమస్యలను క్రియేటివిటీతో పరిష్కరించుకోగలిగే అవకాశం ఉందని ఎంఐటీ హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్ర, మేల్కొలుపుల మధ్య కూరుకుపోతున్న దశలో క్రియేటివ్ మైండ్ (సృజనాత్మక మనస్సు) సమర్థవంతమైనది(particularly fertile) అని, ఇది నిద్ర ప్రారంభం స్థితిగా ఉంటుందని తెలిపారు.

అధ్యయనం ప్రకారం.. నిద్ర దశలో ప్రజలు ఒక నిర్దిష్ట అంశం గురించి కలలు కన్నప్పుడు దాని చుట్టూ మూడు క్రియేటివిటీ టాస్కులను చేయగలిగారని నిపుణుల మొదటి పరిశీలన ద్వారా తెలిసిందని ఎంఐటీ నుంచి పరిశోధకుడు కాథ్లీన్ ఎస్ఫాహానీ అన్నారు. టార్గెటెడ్ డ్రీమ్ ఇంక్యుబేషన్ (targeted dream incubation) అని పిలువబడే ఈ ప్రాంప్టింగ్‌ని సైంటిస్టులు కనుగొన్నారు. నిర్దిష్ట ప్రాంప్ట్ లేకుండా, నిద్రపోయిన వారి కంటే లేదా మేల్కొని ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువగా క్రియేటివ్ స్టోరీస్ జనరేట్ చేశారు. అయితే ఈ ‘డ్రీమ్’ స్థితిలో భిన్నమైన భావనల మధ్య మెదడు మరింత విస్తృతమైన కనెక్షన్‌లను (wide-ranging connections) ఏర్పరుస్తుందని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఇది క్రియేటివిటీని పెంచుతుందని పేర్కొంటున్నాయి. ‘‘మీరు ఈ మెదడు స్థితిని( brain state) యాక్సెస్ చేస్తే, మీ మేల్కొనే జీవితంలో మరింత సృజనాత్మకంగా ఉండవచ్చు’’ అంటున్నారు. అధ్యయనకర్త ఆడమ్ హార్ హోరోవిట్జ్. దశాబ్దాల నాటి పరిశోధనలు కూడా ఈ నిద్ర యొక్క ప్రారంభ దశను ఎన్1( N1) లేదా హిప్నాగోజియా అని పేర్కొన్నాయి. క్రియేటివ్ ఐడియాలకు సారవంతమైన ఫెర్టిల్ బ్రీడింగ్ గ్రౌండ్ (fertile breeding ground ) అని సూచించాయి.

టార్గెట్ ఇదే..

‘పరిశోధకుల టార్గెట్ ఏంటంటే.. మెదడు ఎలా పనిచేస్తుందనే దానిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం. అది ఎలా ప్రభావితం చేయగలదో తెలుసుకోవడమేనని అధ్యయన కర్త పాటీ మేస్ చెప్పారు. పరిశోధకులు మొదట ‘డోర్మియో’ అనే డివైస్‌ను అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ డ్రీమ్ పందేందుకు(incubation) దానిని ఉపయోగించవచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఇది నిద్రకు సంబంధించి మూడు శారీరక గుర్తులను కొలిచే ఒక తొడుగును కలిగి ఉంటుంది. అవి కండరాల టోన్(muscle tone), హృదయ స్పందన రేటు(heart rate), చర్మ ప్రవర్తనలో మార్పులు(skin conductance). ఈ చర్యలను డివైస్ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌కు తెలియజేస్తుంది.

ఎవరైనా గ్లోవ్ ధరించి N1 స్థితిలోకి ప్రవేశించినప్పుడు, నిర్దిష్ట అంశం గురించి కలలు కనేలా యాప్ వారిని ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత, ధరించిన వ్యక్తి నిద్ర యొక్క తదుపరి దశలోకి ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, యాప్ వారిని మేల్కొల్పుతుంది. వారు ఏం కలలు కంటున్నారో నివేదించాలని వారిని అడుగుతుంది, రెస్పాన్స్‌ను రికార్డు చేస్తుంది. ఈ విధంగా సైంటిస్టులు అధ్యయనంలో పాల్గొన్న 49 మందిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒకరికి నిద్రించడానికి 45 నిమిషాలు సమయం ఇవ్వబడింది. డివైస్ చెట్టు గురించి కలలు కనేలా వారిని ప్రేరేపించింది. వారి వివరణను రికార్డ్ చేసింది.

ప్రత్యేక డివైస్‌తో పరిశీలన..

ఒక డ్రీమ్ గురించి నివేదించబడినప్పుడల్లా, డివైస్ ధరించినవారిని తిరిగి నిద్రపోయేలా ప్రోత్సహించింది. చెట్టు గురించి కలలు కనేలా వారిని ప్రేరేపించింది. ఇతర సమూహంలో పాల్గొనేవారు పరికరాన్ని ఉపయోగించి నిద్రపోయారు. కానీ వారి ఆలోచనలను గమనించాలని మాత్రమే సూచించబడ్డారు. 45 నిమిషాల నిద్ర లేదా మేల్కొని ఉన్న తర్వాత మూడు పనులు చేయాలి అడిగారు. అయితే ఈ పనులు సృజనాత్మకతతో అనుబంధించబడాలని గతంలో ఏర్పాటు చేయబడ్డాయి.

మొదటిది స్టోరీ చెప్పే పని దీనిలో పాల్గొనేవారు "చెట్టు" అనే పదంతో సహా క్రియేటివ్ స్టోరీని రాయాలని అడిగారు. అయితే వారిని చెట్ల గురించి కలలు కనాలని సూచించారు. ప్రయోగమంతా మెలకువగా ఉన్న పాల్గొనేవారి కంటే నిద్రపోయేవారి గురించే. కానీ నిర్దిష్ట ప్రాంప్ట్ ఇవ్వబడని వారు కూడా ఎక్కువ సృజనాత్మకతను కనబరుస్తున్నారని కూడా కనుగొనబడింది. చెట్ల గురించి కలలు కనాలని చెప్పబడిన వ్యక్తులు రెండు ఇతర సృజనాత్మకత పరీక్షలలో కూడా అత్యధిక స్కోర్‌లను కలిగి ఉన్నారు. ఒకటి, వారు చెట్టు కోసం వారు ఆలోచించగలిగినన్ని సృజనాత్మక ఉపయోగాలను లిస్ట్ చేశారు. మరొకటి, వారికి నామవాచకాల జాబితా ఇవ్వబడింది. ప్రతిస్పందించాలని అడిగారు.

టార్గెటెడ్ ప్రాంప్ట్‌లతో నాప్ చేసిన పార్టిసిపెంట్‌లు అవి లేకుండా నిద్రపోయిన వారి కంటే 43 శాతం ఎక్కువ క్రియేటివ్‌గా పనిచేశారు. ప్రాంప్ట్‌లు ఉన్నవారు ఇంక్యుబేషన్ లేకుండా మెలకువగా ఉండే వారి కంటే 78 శాతం ఎక్కువ సృజనాత్మకంగా పని చేస్తున్నట్లు కనుగొనబడింది. చెట్ల గురించి ఎక్కువ సంఖ్యలో కలలు కనే వారు తమ కథల్లో మరింత సృజనాత్మకతను కనబరుస్తున్నారని అధ్యయనం కనుగొంది. ఇతర రెండు పనులలో పరిశోధకులు నిద్రపోతున్న వారి కంటే భావనలో చాలా దూరంలో ఉన్న పదాల కలయికను ఉత్పత్తి చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు. నిద్ర ప్రారంభ సమయంలో, మెదడు మేల్కొనే సమయంలో కనెక్ట్ కాని ఆలోచనలను నిద్ర ఒకచోట చేర్చుతుందనే విషయం స్పష్టమైంది. సైంటిస్టులు ప్రస్తుతం తమ స్టడీ ప్రోటోకాల్‌ను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పీడకల-సంబంధిత బాధలకు చికిత్స చేయడం వంటి ఇతర డొమైన్‌లకు దీన్ని విస్తరింపజేస్తున్నారు.



Next Story

Most Viewed