- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Slacklining Feat: తాడుపై నడుస్తూ ఖండాంతరాలను దాటిన వ్యక్తి.. వీడియో వైరల్
దిశ, ఫీచర్స్ : ఈ ప్రపంచంలో మనిషి తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు అంటుంటారు నిపుణులు. అలాంటి స్ఫూర్తిదాయకమైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మీకు డేర్ డేవిల్స్ సాహసాల గురించి తెలిసే ఉంటుంది. అలాగే ఎన్నో ప్రమాదకరమైన అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో స్లాక్ లైనింగ్ కూడా ఒకటి. ఇందులో భాగంగా చాలా ఎత్తైన ప్రదేశంలో కట్టిన ఒక సన్నని తాడుపై మనిషి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడవాల్సి ఉంటుంది. గతంలో కూడా పలువురు ఇందులో ప్రతిభ కనబర్చారు. తాజాగా ఎస్టోనియా (Estonia) దేశానికి చెందిన జాన్ రూస్ మాత్రం గత రికార్డులను బద్దలు కొట్టాడు. ఒక టైట్ రోప్‌పై నడిచిన ఈ స్లాక్ లైనర్ ఒక ఖండాన్ని దాటి మరో ఖండానికి వెళ్లాడు. ఆ వివరాలేంటో చూద్దాం.
అది ఇస్తాంబుల్‌లోని మార్టిర్స్ బ్రిడ్జ్ (July 15th Martyrs Bridge) రెండు సముద్రాలను కలిపే రోప్ బోస్ఫరస్ జలసంధి నుంచి 165 మీటర్ల ఎత్తులో ఉంది. దీని పొడవు1, 074 మీటర్లు కాగా, ఆసియా యూరప్ మధ్య గల ఈ ఎత్తైన ప్రదేశంలో తాడుపై నడిచి అద్భుతం చేశాడు జాన్రూస్ (Jaan roose). అయితే ఈ రెండు ఖండాల మధ్య కేవలం 47 నిమిషాల్లో నడిచిన మొదటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు. జాన్ రూస్. రెడ్ బుల్ సంస్థ ఈ ఫీట్‌ను ప్రోత్సహించింది. టర్కీ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఇన్ ఫ్రా మినిస్ట్రీ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ హైవేస్ కూడా సపోర్ట్ చేశాయి. కాగా జాన్ రోప్‌పై నడిచిన ఈ ఫీట్ తర్వాతే ఇస్తాంబుల్‌లోని ఈ మార్టిర్స్ బ్రిడ్జి గురించి ప్రపంచంలో చాలా మందికి తెలిసింది.
Read More..
Special Story: రైలా.. బుల్లెట్టా? గంటకు వేయి కిలో మీటర్ల వేగం
Video Credits to Estonaian man slacklines acrooss bridge USA TODAY on youtub