మనిషి లేదా కాకి.. ఎవరు తెలివైనవారు? తాజా సర్వేలో తేలిందిదే!

by Disha Web Desk 9 |
మనిషి లేదా కాకి.. ఎవరు తెలివైనవారు? తాజా సర్వేలో తేలిందిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా మనుషుల కంటే కాకులే తెలివైనవని కనుగొన్నారు. భూమిపై మనిషి అత్యంత తెలివైన జీవి ఇప్పటివరకు మనం విశ్వసిస్తున్నాం. కానీ, విజువల్ మెమరీ, 3డీ ప్రదేశంలో ఎగరడం, భూమి అయస్కాంత క్షేత్రం అవగాహన ఆధారంగా అంచనా వేస్తే కాకులే మనుషుల కంటే మరింత తెలివైనవిగా తాజాగా వెల్లడయ్యింది. కాగా1978లో కాలిఫోర్నియాలోని కొంతమంది పరిశోధకులు అమెరికన్ కాకులు వాల్‌నట్‌లను రోడ్డుపై విసిరారు. కారు చక్రంతో తొక్కించినప్పుడు వాటిని ఎలా తింటాయో గమనించారు. 1997లో కాకుల ప్రవర్తనను నిశితంగా పరిశీలన చేశారు.

వాల్‌నట్ గట్టి షెల్‌ను విచ్ఛిన్నం చేయడానికి కాకి కారును ఉపయోగించి తెలుసుకోవడానికి యత్నించారు. శాస్త్రవేత్తలు ఇలా ఇప్పటివరకు 200 కేసులను అధ్యయనం చేయడం జరిగింది. కానీ కాకీ ఆ వాల్ నట్‌ను తీసుకుని కారు పైనుంచి విసిరేయగా అది పగిలింది. వెంటనే అందులోని పండును తీసుకొని తిన్నది. ఇప్పటి వరకు ప్రైమేట్స్ (కోతి జాతులు, మానవులు) మాత్రమే సాధనాలను ఉపయోగించగలవు. అలాగే డాల్ఫిన్లు, ఆక్టోపస్‌లు, కాకులు, పందులు కూడా సాధనాలను వాడుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే విధంగా కాకులు కూడా ఇలాంటివి చేయగలవని మనుషుల కంటే కాకులే తెలివిగలవని తాజాగా అమెరికా పరిశోధకులు బయటపెట్టారు.


Next Story

Most Viewed