వరల్డ్ గిన్నిస్ రికార్డుకెక్కిన వజ్రాల గడియారం.. అదెలాగో తెలుసా !

by Disha Web Desk 17 |
వరల్డ్ గిన్నిస్ రికార్డుకెక్కిన వజ్రాల గడియారం.. అదెలాగో తెలుసా !
X

దిశ, ఫీచర్స్: 17,524 వజ్రాలతో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న డైమండ్ వాచ్ గురించి మీకు తెలుసా.. దీనిని తయారు చేయడానికి, ఇందులో వజ్రాలు అమర్చడానికి మీరట్‌కు చెందిన ఆభరణాల వ్యాపారికి 11 నెలల సమయం పట్టింది. అంతేగాక అదొక ప్రధాన సవాలుగా నిలిచింది. ది కింబెర్లి ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ (Kimberly Process Certification Scheme (KPCS) ద్వారా వజ్రాలు లభిస్తాయని, ఆభరణాల వ్యాపారి, రెనాని జ్యువెలర్స్ సీఈఓ, ఫౌండర్, హర్షిత్ బన్సాల్ తెలిపారు.

వందశాతం నాణ్యత కోసం

గడియారంలో అత్యధికంగా (17,524) వజ్రాలను అమర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న తాము అనేక డిజైన్లకోసం ప్రయత్నించామని, కానీ కింబెర్లి బేసిస్ మాత్రమే వందశాతం సొగసును, నాణ్యతను అందించగలదని తమ అనుభవం ద్వారా తెలిసిందని వెల్లడించాడు. వజ్రాల తయారీలో కూడా తాము అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగామని వివరించాడు. వివిధ రకాల డిజైన్లను ప్రయత్నించాలని తాము అనుకున్నప్పటికీ వందశాతం నాణ్యత గల క్లాసీ డిజైన్ చుట్టే తమ ఆలోచనలు తిరిగాయన్నారు. అయితే వీరి ప్రయత్నం గతంలో అరోన్ షన్ జ్యువెల్లర్స్ నెలకొల్పిన రికార్డును కూడా బద్దలు కొట్టింది. అరోన్ జ్యువెలరీ వారు 2018 డిసెంబర్ లో 15,858 డైమండ్లను అమర్చి గిన్నిస్ రికార్డును సృష్టించారు. కానీ తాజాగా దాన్ని బద్దలు కొట్టినందుకు బన్సాల్ టీమ్, కుటుంబం హ్యాపీగా ఉంది.


ఆకట్టుకున్న స్రింకియా డిజైన్

డిసెంబర్ 29, 2022 లో గిన్నిస్ రికార్డుకు ఎంపికైన వాటిలో తమ వజ్రాల గడియారం ప్రముఖంగా నిలిచిందని, స్రింకియా డిజైన్‌తో ఆకట్టుకుందని రెనాని జ్యువెలల్స్ ఫౌండర్ బన్సాల్ తెలిపారు. నిజానికి స్రింకియా అంటే భారతీయులు అనాదిగా నమ్ముతూ వస్తున్న ఒక ఫ్లవర్‌ను పోలి ఉంటుంది. అది భారతీయులు ఎంతో ఇష్టంగా కొలిచే లక్ష్మీదేవికి సంబంధించినదని అతను వెల్లడించాడు.

అయితే అద్భుతమైన ఈ వజ్రాల గడియారాన్ని తయారు చేయడం ప్రారంభించి, గిన్నిస్ రికార్డు సొంతం చేసుకునే వరకు తమకు 11 నెలల సమయం పట్టిందని తెలిపిన ఆయన ఫైనల్‌గా 17,512 డైమండ్స్ అండ్ 12 బ్లాక్ డైమండ్స్‌ను కింబెర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ ద్వారా మాత్రమే సాధ్యమైందన్నారు. గడియారంలో ఉపయోగించిన వజ్రాలు నిజమైనవేనని ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్ స్టిట్యూట్ ల్యాబ్ (IGI) కూడా నిర్ధారించింది. అయితే ఆ వాచ్ 373.030 గ్రాముల బరువు కలిగి, 54.70 క్యారెట్ల సహజమైన హ్యాండ్ కట్ డైమండ్స్‌తో పొదిగి ఉంది. నాణ్యతకు, మన్నికకు మారుపేరుగా నిలిచిందని బన్సాల్ తెలిపాడు.

వేరే బ్రాండ్లు కూడా అనేక రకాల వజ్రాలను రూపొందించి తయారు చేస్తున్నారు కానీ, తమ బ్రాండ్‌లో మాత్రమే నిజమైన నాణ్యత ఉన్నట్లు రుజువైందని బన్సాల్ పేర్కొన్నాడు. వారు గిన్నిస్ రికార్డు సాధించడం మొదటి సారి ఏమీ కాదు. అనేక రికార్డులు సొంతం చేసుకున్న అనుభవం ఉంది.


ది మారీగోల్డ్ టైటిల్ సొంతం

2020లో ఒక సింగిల్ రింగులో అనేక వజ్రాలను అమర్చడం ద్వారా గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టారు. అప్పట్లో తయారు చేసిన ఆ రింగ్‌లో నాణ్యమైన 12,683 డైమండ్స్‌ను అమర్చారు. ''THE MARIGOLD – The ring of prosperity' అనే పేరుగల టైటిల్‌ను అది సొంతం చేసుకుంది. ఎందుకంటే దాని డిజైన్ మారీగోల్డ్ ఫ్లవర్‌ను పోలి ఉంటుంది. అంతేకాదు అది 2022, మే నెలలో కేరళ బేసిస్‌గా తయారైనటువంటి రెనాని జ్యువెల్స్ సీఈఓ బన్సాల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా.




Next Story

Most Viewed