కమర్షియల్ కల్చర్‌గా మారుతున్న పర్సనల్ లైఫ్..

by Disha Web Desk 6 |
కమర్షియల్ కల్చర్‌గా మారుతున్న పర్సనల్ లైఫ్..
X

దిశ, ఫీచర్స్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థినుల ఎంఎంఎస్ లీక్ ఘటన డిజిటల్ యుగంలో ప్రైవసీ గురించిన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. అరచేతిలోనే ప్రపంచం మొత్తానికి ప్రాప్యత కలిగి ఉండటం వల్ల కలిగే నెగెటివ్ ఎఫెక్ట్‌ను కళ్లకు కట్టింది. ఓ విద్యార్థిని.. హాస్టల్ బాత్రూమ్‌లో ఇతర అమ్మాయిలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు చిత్రీకరించి, ప్రసారం చేయడంపై భారతీయ సాంకేతిక చట్టాల కింద కేసు నమోదు చేయబడింది. అయితే ఈ కేసు.. స్త్రీ తన శరీరానికి సంబంధించి స్వయంప్రతిపత్తిని కోల్పోవడం వంటి సమస్యలను లేవనెత్తినప్పటికీ, ఇది సోషల్ మీడియా దుర్బలత్వాన్ని మరింతగా బహిర్గతం చేసింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అనేక పరిమితులు విధించిన తర్వాత కూడా హానికరమైన కంటెంట్ ఎల్లప్పుడూ వరల్డ్ వైడ్ వెబ్‌లో దాని స్థానాన్ని పదిలపరుచుకుంటోంది. డిజిటల్ బారియర్స్ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు వివిధ మార్గాలను కనుగొన్నందున సమస్య మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రైవసీ ఇష్యూ అనేది ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సాధారణ ఇంటర్నెట్ యూజర్లకు సంబంధించినది. అయినప్పటికీ మన జీవితంలోని కొన్ని అత్యంత ప్రైవేట్, సన్నిహిత వివరాలను విస్తృత ప్రేక్షకులకు వెల్లడించడంలో ఒక స్థాయి సౌకర్యాన్ని పొందాం. కానీ నిత్యం వెంటాడే ఈ నిఘా సంస్కృతిలో వ్యక్తిగత వివరాలు, సున్నితమైన సమాచారాన్ని కంపెనీలు దోపిడీ చేస్తాయి.

ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అణగదొక్కిన చర్యలు..

పౌరుల ఆన్‌లైన్ కార్యకలాపాన్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వాలు వ్యక్తుల వ్యక్తిగత ప్రొఫైల్ నుంచి 'ఐడెంటిఫైయింగ్ ఇన్‌ఫర్మేషన్'ను సులభంగా గుర్తించగలవు, అడ్డగించగలవు, స్టోర్ చేయగలవు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి గోప్యత హక్కుతో సంబంధం లేకుండా జాతీయ భద్రతను పరిరక్షించేందుకు అధికారం ఉపయోగించడాన్ని చట్టబద్ధం చేసినందున ఇది దేశంపై చూపిన ప్రభావాల గురించి మనకు బాగా తెలుసు. ఉదాహరణకు: ఇటీవల హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్.. సైబర్ వాలంటీర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నివేదించమని పౌరులను కోరింది. వ్యతిరేక ఆలోచనలను పంచుకునే వ్యక్తుల సమూహాలను గుర్తించడానికి దీనిని మరింత ఉపయోగిస్తారు. అయితే ఈ చర్యలు దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అణగదొక్కాయి.

ప్రైవేట్ జీవితాల్లో కమర్షియల్ కల్చర్..

నిరంతర నిఘాలో జీవించడమే కాకుండా, కంటెంట్‌ను స్వేచ్ఛగా పంచుకునే నేటి యుగంలో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ ఉనికిని కలిగి ఉన్నారు. ప్రస్తుతం సామాజిక ఆమోదం కోసం అత్యంత ప్రైవేట్ క్షణాలను కమర్షియల్‌గా మార్చే కల్చర్‌లో జీవిస్తున్నాం. ఇక నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్స్.. కంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారేందుకు వ్యక్తులను ప్రోత్సహిస్తోంది. ఈ దిశగా భారతీయుల సంఖ్య పెరుగుతుండగా.. వారు ప్రజా వినియోగం కోసం తమ మొత్తం జీవితాన్ని పంచుకుంటున్నారు. యూట్యూబ్‌లో 'ఫ్యామిలీ వ్లాగింగ్' పెరగడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని ఒక గ్రామ జనాభాలో 30% మంది జీవనోపాధి కోసం కంటెంట్‌ క్రియేట్ చేస్తున్నట్లు ఇటీవలి సర్వే వెల్లడించింది. కొత్త ఆదాయ మార్గాలను కనుగొనడంలో ఇది కుటుంబాలకు కచ్చితంగా సహాయపడుతోంది. అయితే ఈ క్రియేటర్స్‌లో చాలా వరకు తమ రోజువారీ లైఫ్‌స్టైల్‌ను చిత్రీకరిస్తూ, ప్లాట్‌ఫామ్‌పై సన్నిహిత క్షణాలను అప్‌లోడ్‌చేసే 'వ్లాగర్లు' అని గమనించాలి.

చిన్న పిల్లలపై ప్రతికూల ఫలితాలు..

చిన్న పిల్లలు తమ సమ్మతి లేకుండానే ఈ సాధారణ వీడియోల్లో పబ్లిక్ ఫిగర్స్‌గా మారుతున్నారు. ప్రారంభ వయసు నుంచి వారి వ్యక్తిగత జీవితాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ సంఖ్యల యూజర్లతో షేర్ చేయబడుతున్నాయి. ఇది వారి ప్రైవసీ, సేఫ్టీకి సంబంధించిన ఆందోళనలను పెంచుతుంది. ఇది వారిలో ఎదిగే వయసును మరింత ప్రభావితం చేస్తుంది. నిత్యం కెమెరాలకు ఎక్స్‌పోజ్ కావడం వల్ల వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి.

సోషల్ మీడియాలో కంటెంట్‌ను సులభంగా పంచుకోవడం స్వేచ్ఛను ప్రసాదిస్తుంది, 'వాక్ స్వాతంత్య్రాన్ని' పునరుద్ఘాటిస్తుంది. అయితే దీనికి మరోవైపున చెడు తప్పక ఉంటుంది. ఈ సమస్యలు పబ్లిక్, ప్రైవేట్ స్థాయిలో గోప్యత హక్కును కోల్పోయే ఆందోళనలను పెంచుతాయి. ఒక దేశంగా మనం అభివృద్ధి చెందుతున్న సంస్కృతికి అనుగుణంగా నిర్మాణాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాకాకుండా సామాజిక మార్పులకు దారితీసే కల్చరల్ డిస్కషన్‌ను మరింత ప్రోత్సహిస్తే.. అది హాని కలిగించే సమూహాలను కాపాడుతుంది.


Next Story

Most Viewed