6Gతో మ‌నిషి మెదడులో ఇలాంటి మార్పు..కొత్త స్ట‌డీలో షాకింగ్ విష‌యం!

by Disha Web Desk 20 |
6Gతో మ‌నిషి మెదడులో ఇలాంటి మార్పు..కొత్త స్ట‌డీలో షాకింగ్ విష‌యం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 5G ఇంకా అంద‌రి చేతుల్లోకి రాక‌ముందే, ప్రపంచం మొత్తం 6G కోసం ఎదురుచూస్తోంది. అయితే, చైనా శాస్త్రవేత్తలు నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో విస్తుపోయే అంశం తెలిసింది. దాని ప్రకారం, 6G మన మెదడు కణాలను ప్రభావితం చేయగలదని క‌నుగొన్నారు. దాని రేడియో తరంగాల టెరాహెర్ట్జ్ బ్యాండ్. ఇది ఏదైనా స్మార్ట్‌ఫోన్ బ్యాండ్‌విడ్త్‌ను సెకనుకు 1 టెరాబిట్‌కు పెంచగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ఫలితంగా మెదడు క‌ణాలు వేగంగా వృద్ధి చెందుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలియ‌జేస్తున్నారు. స్ట‌డీలో భాగంగా, ప్రయోగశాల ఎలుకల్లో కణాలు రేడియేషన్‌కు గురైనప్పుడు న్యూరాన్లు దాదాపు 150 శాతం పెరుగుతున్న‌ట్లు కనుగొన్నారు.

ఈ పరిశీలన ప్రారంభంలో పరిశోధకులు గందరగోళానికి గురైన‌ట్లు పేర్కొన్నారు. కాగా, మెదడు కణాలు మ‌రింత‌ వేగంతో పెరిగినప్పటికీ, అవి ఆరోగ్యంగా ఉండగలవని నిర్ధారించారు. ఫలితంగా, శాస్త్రవేత్తలు "మెదడు వ్యాధులకు చికిత్స చేయడానికి, అలాంటి చికిత్సలను అభివృద్ధి చేయడానికి వాటిని మరింత స్ట‌డీ చేస్తున్న‌ట్లు అధ్యయనంలో వెల్ల‌డించారు. "టెరాహెర్ట్జ్ రేడియేషన్ ప్రోటోకాల్‌కి సంబంధించిన‌ భద్రత ఒక ప్రధాన ఆందోళన," అని అధ్యయనం ప్రధాన శాస్త్రవేత్త లి జియావోలీ పీర్-రివ్యూడ్ జర్నల్ Acta Physica Sinicaలో ప్రచురించిన‌ పేపర్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : 6 వారాల్లో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను సాధించిన స్నాప్‌చాట్+



Next Story

Most Viewed