ప్ర‌పంచంలోనే అత్యంత 'అస‌హ్య‌మైన' కుక్క‌.. మిస్ట‌ర్ హ్యాపీ!

by Disha Web Desk 20 |
ప్ర‌పంచంలోనే అత్యంత అస‌హ్య‌మైన కుక్క‌.. మిస్ట‌ర్ హ్యాపీ!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనాకు చెందిన 17 ఏళ్ల చివావా మిక్స్ "ప్రపంచంలోని అత్యంత వికారమైన కుక్క"గా ఎంపికైంది. దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతున్న‌ కాలిఫోర్నియాలో సోనోమా-మారిన్ ఫెయిర్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ కుక్క విజ‌యం సాధించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ పోటీ జరగ్గా, మిస్టర్ హ్యాపీ ఫేస్‌ని అత్యంత అస‌హ్య‌మైన డాగ్ విజేత‌గా ప్ర‌కటించారు. శ‌రీరంపైన కణితులు, నరాల సంబంధిత సమస్యలతో హ్యాపీ బాధ‌ప‌డుతోంది. అలాగే, నిటారుగా నిలబడటానికి, నడవడానికి కూడా ఇబ్బందే. అందుకే, తల వంగి ఉంటుంది. కాగా, త‌న ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా హ్యాపీకి డైపర్ కూడా అవసరం.

ఇక‌, చాలా మంది పాల్గొనే ఈ అగ్లియెస్ట్ డాక్ ఈమెంట్‌లో గెలిచిన కుక్క‌ల స‌మాచారాన్ని సోనోమా-మారిన్ ఫెయిర్ వెబ్‌సైట్‌లో ఉంచారు. అందులో వివరణ ప్రకారం, చివావా ఒకప్పుడు దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ఎవ‌రీ ఆస‌రా లేకుండా జీవించింది. అయినప్పటికీ, అంత క‌ష్టంలోనూ ఈ కుక్క 17 ఏళ్ల వయస్సుకు చేరుకుంది. మిస్టర్ హ్యాపీ ఫేస్ సహజమైన ల‌క్ష‌ణాల‌తోనే ఉంటుంద‌ని, సంతోషంగా ఉన్నప్పుడు "డాడ్జ్ రామ్ డీజిల్ ట్రక్ లాగా" శబ్దం చేస్తుందని దాని య‌జ‌మాని జెనెడా బెనెల్లీ తెలిపారు. అయితే, పోటీలో హ్యాపీ చేసిన ప్రదర్శన న్యాయనిర్ణేతలను కదిలించింది.

అనారోగ్యంతో విడిచిపెట్ట‌బ‌డిన ఈ కుక్క‌ ఆరిజోనాలోని షెల్ట‌ర్‌లో ఆశ్రయం పొందిన త‌ర్వాత‌ 2021 ఆగస్టులో జెనెడా కుటుంబం దీన్ని దత్తత తీసుకుంది. షెల్ట‌ర్ హోమ్‌లో కణితులు, వివిధ‌ ఆరోగ్య పరిస్థితుల కారణంగా మిస్టర్ హ్యాపీ ఫేస్ "కొన్ని వారాలో, బహుశా ఒక నెల మాత్రమే" జీవింస్తుంద‌ని, అక్క‌డ‌ పశువైద్యుడు తనతో చెప్పినట్లు ఈ సంద‌ర్బంగా జెనెడా గుర్తుచేసుకుంది. "ప్రేమ, దయ, మమ్మీ ముద్దుల వ‌ల్ల హ్యాపీ మా కుటుంబంతో క‌లిసి, ఊహించిన చిన్న జీవితాన్ని సంతోషంగా జ‌యించ‌డానికి మేము సహాయం చేసాము" అని ఆమె వెల్ల‌డించింది. ఇక‌, ఈ మిస్టర్ హ్యాపీ ఫేస్ పోటీలో చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌న యజమానికి $1,500 (రూ. 1,18,000) ప్రైజ్ మనీ, పోటీలో గెలుపొందిన తర్వాత న్యూయార్క్ నగరానికి ట్రిప్‌ను ఉచితంగా అందించింది.


Next Story