లేట్ అయినా పర్లేదు.. ఒంటరితనమే బెస్ట్.. ఇండియాలో అమ్మాయిల ఆలోచన

by Disha Web Desk 7 |
లేట్ అయినా పర్లేదు.. ఒంటరితనమే బెస్ట్.. ఇండియాలో అమ్మాయిల ఆలోచన
X

దిశ, ఫీచర్స్: మ్యారేజ్ అంటేనే ఫుల్ హంగామా. సూపర్ హ్యాపీగా రిలేటివ్స్‌తో టైం స్పెండ్ చేయడం.. ఫ్రెండ్స్ అందరితో ధూమ్ దామ్ డ్యాన్స్‌లతో పాటు మరింత ఫన్ అందించే ఆచార వ్యవహారాలతో ఆ మూడు నాలుగు రోజులు టైం కూడా తెలియదు. కానీ పెళ్లి చేసుకునే అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఆ సమయంలో అందరూ ఎంజాయ్ చేస్తున్నా.. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు మాత్రం యాంగ్జయిటీ, ఆందోళన ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇండియాలోని స్త్రీలలో ఈ బాధ మరింత ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తెలిపింది.

డేటింగ్ యాప్ బంబుల్ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం.. దాదాపు ఐదుగురిలో ఇద్దరు అంటే 39 శాతం మంది ఇండియన్ డాటర్స్ తమ కుటుంబాలు పెళ్లిళ్ల సీజన్‌లో తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకోవాలని ప్రోతహిస్తున్నాయని చెప్తున్నారు. పెళ్లి చేసుకోవాలనే చర్చ వచ్చినప్పుడు ఒత్తిడికి గురవుతున్నారు. మ్యారేజ్ సీజన్‌లో దాదాపు 33 శాతం మంది అవివాహిత భారతీయులు తాము నిబద్ధతతో, దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కానీ 81 శాతం మంది మహిళలు ఒంటరిగా ఉండేందుకే మొగ్గుచూపుతున్నారు. 83 శాతం మంది సరైన వ్యక్తిని కనుగొనే వరకు వెయిట్ చేయాలని అనుకుంటున్నారు.


Next Story

Most Viewed