సమ్మర్ స్పెషల్ : చల్ల చల్లని బాదం మిల్క్ ఇంట్లోనే ఇలా తయారు చేయండి!

by Disha Web Desk 8 |
సమ్మర్ స్పెషల్ : చల్ల చల్లని బాదం మిల్క్ ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే చాలు ఉక్కపోత, వేడితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో చల్ల చల్లగా ఏదైనా తాగాలని లేదా కూల్‌గా ఐస్ క్రీమ్ తినాలని చాలా మంది అనకుంటారు. మరీ ముఖ్యంగా వేసవిలో బాదం మిల్క్ అంటే చాలా మంది పడిచచ్చిపోతారు.తప్పనిసరిగా రోజుకు ఒక్కసారైనా బాదం మిల్క్ తాగుతుంటారు.ఇక నోటికి రుచిని ఇచ్చే ఈ బాదం మిల్క్ తాగడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే సమ్మర్ స్పెషల్‌గా దీనిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బాదం మిల్క్ అనగానే అందరికీ నోరూరిపోతుంది. అయితే దీనిని మన ఇంట్లో తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే?

బాదం పప్పులు - ఒక కప్పు

జీడిపప్పు - ఒక కప్పు

పంచదార - 100 గ్రాములు

యాలకుల పొడి - అర స్పూన్

పాలు - అర లీటరు

తయారు చేసే విధానం : ముందుగా బాదం పప్పు, జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత వెన్న తీయని పాలను గిన్నెలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో యాలకుల పొడి, పంచదార వేసి బాగా కలుపుకోవాలి.

ఇలా కలిపిన తర్వాత మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న బాదం, జీడి పప్పు పౌడర్‌ను పాలలో వేసి, గ్యాస్ చిన్నగా పెట్టుకొని, ఆ పాలు మరిగేలా చూడాలి. బాదం పాలు మంచిగా మరిగాక, గ్యాస్ ఆఫ్ చేసి, వాటిని వేరే బౌల్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ బాదం మిల్క్‌ను గ్లాసుల్లో వేసి పైన సన్నగా తరిగిన బాదం, జీడిపప్పులను వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. అంతే ఇక చల్ల చల్లగా ఉండే బాదం మిల్క్ రెడీ, ఇక ఇది మీ పిల్లలకు ఇస్తే ఎంతో ఇష్టంగా తాగుతుంటారు.బయట చేసేవాటికంటే వంద శాతం సూపర్ టేస్ట్‌తో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేయండి.

Read More..

పెరుగులో నీటిని కలిపి మజ్జిగ చేస్తున్నారా.. అయితే, వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

Next Story

Most Viewed