42 బంతుల్లో సెంచరీ చేసిన లియామ్ లివింగ్‌స్టోన్

by  |
Livingstone
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకున్నది. వన్డే సిరీస్‌లో ఘోర ఓటమికి తొలి టీ20లో ప్రతీకారం తీర్చుకున్నారు. శుక్రవారం రాత్రి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 232/6 స్కోర్ చేసింది. టీ20ల్లో పాకిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఓపెనర్లు బాబర్ అజామ్ (85), మహ్మద్ రిజ్వాన్ (63) కలసి తొలి వికెట్‌కు 150 పరుగులు జోడించారు. చివర్లో ఫకర్ జమాన్ (26), మొహ్మద్ హఫీజ్ (24) మెరుపులు మెరిపించడంతో పాకిస్తాన్ భారీ స్కోర్ చేసింది.

233 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 7 ఓవర్లలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ కేవలం 42 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. 17 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన లియామ్.. ఆ తర్వాతి 25 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ తరపున టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. అయితే జట్టు స్కోర్ 170 వద్ద ఉండగా లియమ్ లివింగ్‌స్టోన్ సెంచరీ చేసిన తర్వాతి బంతికే షాబాద్ ఖాన్ బౌలింగ్‌లో షాహీన్ ఆఫ్రీది అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో అవుటై పెవీలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు 201కే ఆలౌట్ అయ్యింది. లియామ్ లివింగ్‌స్టోన్ రికార్డు సెంచరీ నమోదు చేసినా 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Next Story

Most Viewed