ప్రధానికి తమిళనాడు సీఎం లేఖ

by  |
ప్రధానికి తమిళనాడు సీఎం లేఖ
X

చెన్నై : తమిళనాడులో యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి ఆక్సిజన్‌ను ఇతర దేశాలకు తరలిస్తున్నారని, ఇది రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులకు దారినిస్తాయని సీఎం పళనిస్వామి ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యధిక యాక్టివ్ కేసులున్న తగిన ఆక్సిజన్ కోటా కేటాయించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముందని, కాగా రాష్ట్రంలో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నదని వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ ఇక్కడి అవసరాలకు సరిపోదని, దానికి మించి 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం తరలిస్తున్నదని తెలిపారు. దీన్ని వెంటనే ఆపేయాలని, లేదంటే రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని తెలిపారు.

Next Story