కట్టుదిట్టమైన భద్రత చేపట్టండి

by  |
కట్టుదిట్టమైన భద్రత చేపట్టండి
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ శాసన సభ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యలో కొవిడ్ నిబంధనలకు లోబడి కట్టుదిట్టమైన భద్రతా చేపట్టాలని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఆదేశించారు. శనివారం అసెంబ్లీ స్సీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి పోలీసు ఉన్నతాధికారులతో అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. సభ్యులు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. భద్రతా పరంగా తీసుకుంటున్న చర్యలను పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల భద్రతపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ ఓఎస్డీ శశిధర్ తెలిపారు.

సీఎం, ఇతర ముఖ్యుల కాన్వాయ్ రిహార్సల్స్ కూడా నిర్వహించామన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్టు వచ్చిన తరవాతే ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల నేపథ్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. సమావేశాల దృష్ట్యా అసెంబ్లీ, చుట్టు పక్కల ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలు ప్రారంభం రోజున, ముగింపు రోజున ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశముందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

Next Story

Most Viewed